Manchu Manoj Marriage : నేడే మంచు మనోజ్ రెండో పెళ్లి.. ఎవరితోనో తెలుసా?? ఫోటో షేర్ చేసిన మనోజ్..
తాజాగా నేడు మనోజ్ అధికారికంగా భూమా మౌనిక ఫోటోని పోస్ట్ చేసి పెళ్లికూతురు, మనోజ్ వెడ్స్ మౌనిక అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య..................

Manchu Manoj Marriage : మంచు మనోజ్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఓ సినిమాని ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ దీనిపై అధికారికంగా స్పందించలేదు. కానీ ఇద్దరూ కలిసి బయట కనపడటం, మనోజ్ సినిమాని మౌనిక పోస్ట్ చేయడంతో వీరిద్దరి పై మరిన్ని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మనోజ్ భూమికను నేడు పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా నేడు మనోజ్ అధికారికంగా భూమా మౌనిక ఫోటోని పోస్ట్ చేసి పెళ్లికూతురు, మనోజ్ వెడ్స్ మౌనిక అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరగబోతుంది. నేడు ఫిలింనగర్ లోని మోహన్ బాబు ఇంట్లో మనోజ్ మౌనిక ల వివాహం జరగనుంది. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు మనోజ్ కి, మౌనికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023