Naatu Naatu : నాటు నాటు పాటకు లైవ్ లో స్టెప్పులేసిన BTS సింగర్.. స్పెషల్ పోస్ట్ చేసిన RRR యూనిట్..

ఇటీవలే సౌత్ కొరియాకు చెందిన ఇండియన్ ఎంబసీ అధికారులు అంతా కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది...................

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 04:19 PM

Naatu Naatu : నాటు నాటు పాటకు లైవ్ లో స్టెప్పులేసిన BTS సింగర్.. స్పెషల్ పోస్ట్ చేసిన RRR యూనిట్..

Naatu Naatu :  మన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచం నలుమూలల నుంచి RRR సినిమాకు అభినందనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ అన్ని దేశాల ప్రేక్షకులని ఊపేసి ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. వివిధ దేశాల ప్రేక్షకులు నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా షేర్ చేస్తూనే ఉన్నారు.

ఇటీవలే సౌత్ కొరియాకు చెందిన ఇండియన్ ఎంబసీ అధికారులు అంతా కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఆ వీడియోని ప్రధాని మోడీ కూడా షేర్ చేసి అభినందించడం విశేషం. తాజాగా సౌత్ కొరియాకు చెందిన BTS అనే ఓ ఫేమస్ మ్యూజిక్ బ్యాండ్ లోని సింగర్ జంగ్‌కుక్‌ నాటు నాటు పాటని హమ్ చేస్తూ స్టెప్పులేశాడు.

Pathaan Collections : హమ్మయ్య.. ఇన్నాళ్లకు బాహుబలి ఆ రికార్డుని బద్దలు కొట్టిన పఠాన్..

ఇటీవల జంగ్‌కుక్‌ తన ఫ్యాన్స్ తో మాట్లాడటానికి లైవ్ లోకి వచ్చాడు. ఈ లైవ్ లో జంగ్‌కుక్‌ నాటు నాటు పాటని ప్లే చేసి హమ్ చేస్తూ కుర్చీలోనే కూర్చొని స్టెప్పులు వేశాడు. దీంతో ఇండియాలోని BTS ఫ్యాన్స్ దీనిని వైరల్ చేయగా RRR టీం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . RRR ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేసి.. జంగ్‌కుక్‌ నీకు ఈ పాట ఇంతలా నచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. మీకు, మీ BTS బృందానికి, దక్షిణ కొరియా మొత్తానికి మేము టన్నుల కొద్ది ప్రేమాభిమానాలను పంపిస్తున్నాం అని పోస్ట్ చేశారు.