Onion Oil : ఉల్లిపాయ నూనె వలన కూడా అనేక ఉపయోగాలు ఉంటాయని తెలుసా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. మనం అందరం అన్ని కూరల్లో ఉల్లిపాయలు వేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఉల్లిపాయలను తినడానికి మాత్రమే కాకుండా మన జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. దాని కోసం.................

Kaburulu

Kaburulu Desk

March 4, 2023 | 04:31 PM

Onion Oil : ఉల్లిపాయ నూనె వలన కూడా అనేక ఉపయోగాలు ఉంటాయని తెలుసా?

Onion Oil :  ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. మనం అందరం అన్ని కూరల్లో ఉల్లిపాయలు వేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఉల్లిపాయలను తినడానికి మాత్రమే కాకుండా మన జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. దాని కోసం ఉల్లిపాయల నుండి ఉల్లి నూనెను తయారు చేస్తారు. మన ఇంట్లో ఉల్లి నూనె తయారు చేయడానికి మనం ఒక kg ఉల్లిపాయలు, 200 ml కొబ్బరినూనె తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలను పొట్టు తీసి ఉల్లిపాయలను ముక్కలుగా కోసి మిక్సి పట్టాలి. దానిని కొబ్బరినూనెలో వేసి ఇరవై నిముషాల పాటు మరిగించాలి. దానిని చల్లార్చిన తరువాత వడపోసి ఆ ఉల్లి నూనెను ఉపయోగించుకోవాలి.

ఇలా తయారైన ఉల్లి నూనెను గుడ్డుసొనతో కలిపి దానిని జుట్టుకు మాస్క్ లాగా వేసుకోవాలి. దీని వలన మన జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది. ఉల్లినూనెను అల్లం రసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టుకు వచ్చే స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఉల్లినూనెకు తేనెను కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు తేమగా తయారవుతుంది. ఉల్లినూనె వాడడం వలన జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఉల్లినూనెను వాడడం వలన జుట్టు తొందరగా తెల్లగా మారడం తగ్గుతుంది. ఈ నూనెను వాడడం వలన ఇది జుట్టుకు కండిషనర్ గా ఉపయోగపడుతుంది. జుట్టు సిల్కీ గా మరియు ప్రకాశవంతంగా మారడానికి కూడా ఉల్లినూనె ఉపయోగపడుతుంది. వెంట్రుకలు పలుచబడడం, చిట్లడం వంటివి కూడా తగ్గుతాయి. ఇంకా జుట్టు తొందరగా పెరగడానికి కూడా ఉల్లినూనె సహాయపడుతుంది. కాబట్టి సహజమైన ఉల్లినూనెను ఇంటిలోనే మనం తయారుచేసుకొని దానిని ఉపయోగించి మన జుట్టును కాపాడుకోవచ్చు. ఇంకా మన వెంట్రుకలు తొందరగా రాలిపోకుండా, తొందరగా జుట్టు మందంగా పెరగడానికి కూడా ఉల్లి నూనె సహాయపడుతుంది.

Rice : బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

ఇటీవల ఉల్లి నూనెను మార్కెట్లు అమ్ముతున్నారు కూడా. కొన్ని షాంపూ కంపెనీలు ఉల్లిపాయ నుంచి తయారు చేశాం అని కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఉల్లి నూనె మన జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.