Ram Charan : మోదీ, సచిన్‌తో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ సమ్మిట్‌లో పాల్గొనున్న రామ్‌చరణ్..

రామ్ చరణ్ అరుదైన గౌరవాలు దక్కించుకుంటున్నాడు. మొన్న హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న చరణ్, తాజాగా..

Kaburulu

Kaburulu Desk

March 15, 2023 | 12:27 PM

Ram Charan : మోదీ, సచిన్‌తో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ సమ్మిట్‌లో పాల్గొనున్న రామ్‌చరణ్..

Ram Charan : రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ ఫేమ్ తో ఇప్పటికే పలు అరుదైన గౌరవాలు అందుకుంటూ వచ్చారు చరణ్ అండ్ ఎన్టీఆర్. తాజాగా రామ చరణ్.. మోదీ, సచిన్ లతో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ప్రముఖ నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో ప్రతి ఏడాది దేశంలోని వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటారు.

Pawan Kalyan : వినోదాయ సిత్తం రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో మార్చ్ 17,18 తేదీల్లో జరగబోయే సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొబోతున్నాడు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మాత్రమే హాజరు కానుండడం విశేషం. అంతేకాదు టాలీవుడ్ నుంచి ఈ ఆహ్వానం అందుకున్న మొదటి నటుడు కూడా రామ్ చరణే. ఈ సమ్మిట్ లో చరణ్.. ఆస్కార్ అందుకున్న దాని గురించి, సినిమాలు గురించి మాట్లాడనున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నాడు. ఇక ఈ సమ్మిట్ లో వీరితో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు జయశంకర్, స్మృతి ఇరానీ, జాన్వీ కపూర్, శశిథరూర్ లతో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొనున్నారు.

కాగా రామ్ చరణ్ గతంలో కూడా ఇటువంటి గౌరవం దక్కించుకున్నాడు. ప్రముఖ నేషనల్ మీడియా హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో కూడా చరణ్ పాల్గొని సందడి చేశాడు. ఇక తమ అభిమాన నటుడు ఇలాంటి గౌరవం దక్కించుకోవడంతో.. చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.