Naatu Naatu Song : చరిత్ర సృష్టించిన నాటు నాటు సాంగ్.. ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు..
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి జరిగాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ ఆస్కార్ వేడుకలు జరిగాయి. ఈ కార్యాక్రమానికి...........

Naatu Naatu Song : కొన్ని రోజులుగా ఇండియన్స్ అందరి కల ఒకటే. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ గెలవాలని. రాజమౌళి దర్శకత్వంలో రామ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమా, సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచం అందరూ మెచ్చారు. నాటు నాటు సాంగ్ అయితే చిన్నా పెద్దా తేడా లేకుండా టాలీవుడ్ హాలీవుడ్ అనే తేడా లేకుండా అందర్నీ ఊపేసింది. అంతర్జాతీయ వేదికలపై అనేక అవార్డులు గెలుచుకున్న నాటు నాటు సాంగ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
నాటు నాటు పాటను చంద్రబోస్ రాయగా కీరవాణి సంగీతం స్వరపరిచారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ ని కంపోజ్ చేయగా చరణ్, తారక్ తమ స్టెప్పులతో అదరగొట్టేశారు.ప్రపంచాన్ని ఊపేసిన న్తు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలవడంతో ఆస్కార్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది.
ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి జరిగాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ ఆస్కార్ వేడుకలు జరిగాయి. ఈ కార్యాక్రమానికి ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ గా చేశాడు. దేశ విదేశాల సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు విచ్చేశారు. మన RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవలతో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
Oscar 2023 : ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ.. సందడి చేసిన ఎన్టీఆర్, చరణ్!
ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అయిదు పాటలు నామినేట్ అవ్వగా RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చింది. అవార్డుని ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. కీరవాణి స్టేజిపై మాట్లాడుతూ అందరికి థ్యాంక్స్ చెప్తూ ఇండియన్ సినిమాకి గర్వకారణం అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఇక అభిమానులు, ప్రేక్షకులు, అన్ని రంగాల ప్రముఖులు నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచినందుకు అభినందనలు తెలియచేస్తున్నారు.
We’re blessed that #RRRMovie is the first feature film to bring INDIA’s first ever #Oscar in the Best Song Category with #NaatuNaatu! 💪🏻
No words can describe this surreal moment. 🙏🏻
Dedicating this to all our amazing fans across the world. THANK YOU!! ❤️❤️❤️
JAI HIND!🇮🇳 pic.twitter.com/9g5izBCUks
— RRR Movie (@RRRMovie) March 13, 2023