Pawan Kalyan : వినోదాయ సిత్తం రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న పేరు చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామి సృష్టించడానికి. అందుకనే పవన్ టాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటాడు. తాజాగా పవన్ తాను ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వెల్లడించాడు.

Kaburulu

Kaburulu Desk

March 15, 2023 | 11:57 AM

Pawan Kalyan : వినోదాయ సిత్తం రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?

Pawan Kalyan : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న పేరు చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామి సృష్టించడానికి. పవన్ సినిమాలకి హిట్టు, ప్లాప్ లతో సంబంధం ఉండదు. రిజల్ట్ ఎలా ఉన్నా సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి రావాల్సిందే. అందుకనే నిర్మాతలు పవన్ తో సినిమా చేయడానికి ఇష్ట పడతారు. అందుకోసం పవన్ కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉంటారు. అందుకనే పవన్ టాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటాడు.

Pawan Kalyan : పవర్ స్టార్ – సుప్రీం హీరో సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసా?

తాజాగా పవన్ తాను ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వెల్లడించాడు. నిన్న (మార్చి 14) మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో మాట్లాడుతూ ఇతర పార్టీ నాయకులు నుంచి తాను డబ్బులు తీసుకుంటున్నాడు అనే విమర్శలను తిప్పి కొడుతూ.. నేను ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నా. ఒక రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నా. ప్రస్తుతం చేస్తున్న సినిమాకి 25 రోజులు కేటాయించా, అంటే ఆ ఒక్క సినిమాకి 50 కోట్లు వస్తున్నాయి. అయితే ప్రతి సినిమాకి అంటే తీసుకోను. నేను డబ్బులు సినిమాలు చేసి సంపాదిస్తున్నాను. నాకు ఏ రాజకీయ నాయకుడు డబ్బులు ఇవ్వడం లేదు. మీరు నా పై చూపించే అభిమానమే నేను అంత రెమ్యునరేషన్ తీసుకునే చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ప్రస్తుతం పవన్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదాయ సిత్తం సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో సాయి ధరమ్ మెయిన్ లీడ్. పవన్ సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తాడు. కేవలం సినిమాలో సగ భాగం కనిపించేందుకు పవన్ 50 కోట్లు తీసుకుంటున్నాడా? అని అందరు ఆశ్చర్య పడుతున్నారు. సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.