Traimbhakeshwar temple: లోపల చతురస్రాకారంలోను… బయట నక్షత్రాకారంలోను ఉండే దేవాలయం ఏదో తెలుసా…?

నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు.
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.
గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం. ఈ ఆలయం హేమంత్పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చతుర్స్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.