Suriya : 10 భాషల్లో రెండు భాగాలుగా సూర్య కొత్త మూవీ!

Kaburulu

Kaburulu Desk

December 19, 2022 | 08:43 PM

Suriya : 10 భాషల్లో రెండు భాగాలుగా సూర్య కొత్త మూవీ!

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ పలితాలతో పని లేకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటాడు ఈ నటుడు. ఇక ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో తన నటనకి ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.

Suriya : ఆ పాత్ర నచ్చలేదు కానీ.. కమల్ హాసన్ కోసమే ఆ రోల్ చేశాను..

తాజాగా ఈ హీరో మరో ప్రయోగంతో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమయ్యాడు. సిరుతై శివ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ డ్రామాని తెరకెక్కించబోతున్నాడు. సూర్య వారియర్ హీరోగా కనిపించబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. అంతేకాదు ఈ మూవీ మొత్తం 10 భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉన్నది అనేది తెలియాలి.

కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. అయితే డైరెక్టర్ శివ ఇప్పటి వరకు మాస్ మసాలా సినిమాలనే మాత్రమే తెరకెక్కించాడు. మొదటిసారి ఒక పీరియాడికల్ డ్రామాతో తను కూడా ప్రయోగం చేస్తున్నాడు.