Ustaad Bhagat Singh : మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పనులు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే న్యూస్..

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎటువంటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. ఆ సినిమా ఇచ్చిన జోష్ పవన్ అభిమానులు ఇప్పటికి మర్చిపోలేరు. దీంతో మరోసారి వీరిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాదిలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో మూవీ పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. టైటిల్ మారడంతో ఈ సినిమా మొదట అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్? కాదా? అనే డైలమాలో పడ్డారు అభిమానులు.
RRR : RRR పై తమ్మారెడ్డి వ్యాఖ్యలకు.. నాగబాబు, రాఘవేంద్రరావు కౌంటర్లు!
ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ మూవీ తమిళ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలు పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ప్రస్తుతం పవన్ వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీలోని పవన్ షూటింగ్ పార్ట్ నెలలో పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణ పూర్తి కాగానే ఉస్తాద్ సెట్ లో పాల్గొనున్నాడట. దీంతో హరీష్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో వేగం పెంచేశాడు. ఉస్తాద్ కోసం భారీ సెట్ ని నిర్మించబోతున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ బోస్, హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త ఫుల్ జోష్ ని ఇస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి కూడా పని చేస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ శ్రుతిహాసన్ తీసుకుంటారా? లేదా? మరో హీరోయిన్ కోసం చూస్తున్నారా? అనేది సస్పెన్స్ గా ఉంది. తాజాగా శృతిహాసన్ మైత్రి మేకర్స్ బ్యానర్ లో రెండు హిట్లు అందుకున్న విషయం తెలిసిందే.
View this post on Instagram