Kushi Re Release : అభిమానులను ‘ఖుషి’ చేసేందుకు న్యూ ఇయర్ గిఫ్ట్ సిద్ధం చేసిన పవన్..

Kushi Re Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా లవ్ అండ్ రొమాంటిక్ కామెడీతో తెరకెక్కిన సినిమా ‘ఖుషి’. 2001లో వచ్చిన ఈ మూవీ ఒక సంచలనం. దర్శకుడు ఎస్.జె.సూర్య తన క్యాచీ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్లకు రప్పించాడు. పవన్ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలు రాయిగా ఉండడమే కాకుండా తెలుగు చిత్రసీమలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.
Waltair Veerayya : రేపు రానున్న ‘చిరంజీవి-శ్రీదేవి’..
ఇక ఈ సినిమాలోని నడుము సీన్ అయితే ఎంతోమందికి ఫేవరెట్. ఇప్పటి సినిమాల్లో కూడా ఆ సీన్ రిఫరెన్స్ తో కొన్ని సన్నివేశాలను రాసుకుంటుంటారు ఇప్పటి రచయతలు. కాగా ఈ మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న ఈ చిత్రాన్ని విడుదల చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నారు.
అయితే ఈ సినిమా రీ రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు ఇప్పటికి తెరపడింది. దీంతో రిలీజ్ రోజున సందడి చేయడానికి ఇప్పటినుంచే ప్లాన్స్ వేస్తున్నారు అభిమానులు. కాగా ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నాడు. త్వరలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నాడు.
A Blockbuster for Ages, An OG Love Saga. Re-live Evergreen Romance 😍
Enjoy once again the ever-lasting Magic of love #Kushi, from 31 Dec in theatres near you! ✨ #KushiReRelease @PawanKalyan @iam_SJSuryah @bhumikachawlat @pcsreeram #ManiSharma @AMRathnamOfl 🙏🙏🙏 pic.twitter.com/AJ7xdSPCOd
— S J Suryah (@iam_SJSuryah) December 19, 2022