Chiranjeevi : రవితేజతో నటించాలి అంటే కోపం వస్తుంది.. చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. రవితేజతో సినిమా చేయాలి అంటే నాకు కోపం, చిరాకు వస్తాయి.

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 05:24 PM

Chiranjeevi : రవితేజతో నటించాలి అంటే కోపం వస్తుంది.. చిరంజీవి!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్‌గా దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. కె బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి తరువాత చిరు మళ్ళీ ఆ తరహా పాత్రలో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

Chiranjeevi : విశాఖలో స్థలం కొన్నా.. ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అవుతా.. చిరంజీవి!

ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘రవితేజతో సినిమా చేయాలి అంటే నాకు కోపం, చిరాకు వస్తాయి. సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు యాక్టింగ్ మీద ద్రుష్టి పెట్టనివ్వడు. సెట్ లో బాగా అల్లరి చేసేస్తాడు. సరదా కబురులు చెబుతూ అందర్నీ నవ్విస్తుంటాడు. మొత్తానికి సెట్ లో గందరగోళం సృష్టిస్తాడు. అలాగే ఇంతముందు రవితేజ మాట్లాడుతూ తాను విజయవాడ వాడిని అంటూ చెప్పాడు. కానీ అతను పుట్టి, పెరిగింది అంతా ముంబైలోనే. ఏదో తెలుగు వారి ఆదరణ పొందడం కోసం నేను లోకల్ అంటూ చెప్పుకుంటాడు అసలు నమ్మకండి’ అంటూ సరదాగా మాట్లాడాడు.

రవితేజతో మొదట హిందీ గ్యాంగ్ లీడర్ లో కలిసి నటించా. అప్పుడు తన నాకు ఒక చిన్న ఫ్రెండ్ గా నటించాడు. ఆ తరువాత అన్నయ్య సినిమాలో నాకు తమ్ముడిగా నటించాడు. అలా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, ఈరోజు తనకంటూ ఒక సొంత గుర్తింపు సంపాదించుకొని.. అందరి చేత మాస్ మహారాజ్ అనిపించుకుంటుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాలో మా ఇద్దరి క్యారెక్టర్‌లు సై అంటే సై అనేలా ఉంటాయి. ఈ చిత్రంలో రవితేజ నటించడంతో మూవీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది అంటూ వెల్లడించాడు చిరంజీవి. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.