Waltair Veerayya : వాల్తేరు వీరయ్య సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి.. వీరసింహారెడ్డి కారణమా?

మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా కాలం తరువాత వస్తున్న మాస్ మసాలా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇక మూవీలోని నాలుగు సాంగ్స్ ని సింపుల్ గా రిలీజ్ చేసిన మూవీ టీం.. ఈ సాంగ్ ని మాత్రం గ్రాండ్ గా హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం బాలయ్య వీరసింహారెడ్డి ప్రమోషన్స్ అంటున్నారు నెటిజెన్లు.

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 07:34 PM

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి.. వీరసింహారెడ్డి కారణమా?

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలా కాలం తరువాత వస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చిరుకి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవలే గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. కాగా ఇప్పుడు ఈ సినిమాలోని 5వ సాంగ్ ని కూడా అలాగే గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేశాడు చిరంజీవి.

Chiranjeevi : శృతిహాసన్‌ని ఒంగోలు ఫంక్షన్‌లో ఎవరో భయపెట్టారు.. చిరంజీవి!

‘నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ’ అంటూ సాగే ఈ సాంగ్ ని జనవరి 11న ఉదయం గం.10:35 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ మూవీలోని నాలుగు సాంగ్స్ ని సింపుల్ గా రిలీజ్ చేసిన మూవీ టీం.. ఈ సాంగ్ ని మాత్రం గ్రాండ్ గా హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం బాలయ్య వీరసింహారెడ్డి ప్రమోషన్స్ అంటున్నారు నెటిజెన్లు.

వీరసింహారెడ్డి మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్ అండ్ సాంగ్స్.. ఇలా ప్రతి దాని ఈవెంట్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ ఈ తరహాలో లేకపోవడంతో మెగా అభిమానులు ఫీల్ అయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ఫ్యాన్ మీట్ నిర్వహించి మెగా బ్రదర్ నాగబాబుకి తెలియజేశారు. దీంతో ఇప్పుడు ఈ సాంగ్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కారణం ప్రత్యక్షంగా అభిమానులు అయినా, పరోక్షంగా వీరసింహారెడ్డే కారణం అంటున్నారు నెటిజెన్లు. కాగా ‘నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ’ అనే ఈ సాంగ్ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా క్యాచీగా ఉంటుంది అంటున్నారు మేకర్స్.