Suriya : ఆ పాత్ర నచ్చలేదు కానీ.. కమల్ హాసన్ కోసమే ఆ రోల్ చేశాను..

Kaburulu

Kaburulu Desk

October 12, 2022 | 02:51 PM

Suriya : ఆ పాత్ర నచ్చలేదు కానీ.. కమల్ హాసన్ కోసమే ఆ రోల్ చేశాను..

Suriya :  ఇటీవల విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ హిట్ కొట్టడంతో ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఆయన. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటించారు. సూర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. సూర్య చేసిన రోలెక్స్ పాత్ర బాగా క్లిక్ అవ్వడంతో సినిమాకి మరింత ప్లస్ అయి సినిమా మరింత సక్సెస్ సాధించి భారీ కలెక్షన్లని కూడా సాధించింది.

ఇటీవల ఫిలింఫేర్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న సూర్య విక్రమ్ సినిమా, రోలెక్స్ పాత్ర గురించి మాట్లాడారు. సూర్య మాట్లాడుతూ.. ”కమల్ హాసన్ గారు నాకు స్ఫూర్తి. ఆయన్ని చూసే నేను నటన నేర్చుకున్నాను. విక్రమ్ సినిమాలో ఒక చిన్న రోల్ ఉందని దర్శకుడు లోకేష్ నాకు ఫోన్ చేసి చెప్పగానే ఓకే చేసేశాను. కానీ రోలెక్స్ పాత్ర గురించి విన్నతర్వాత అది నాకు నచ్చలేదు. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అలాంటి పాత్ర నేను చేస్తే ఏమనుకుంటారో అనుకున్నాను. కానీ కమల్ గారి కోసమే ఆ సినిమా చేశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాత్ర బాగా క్లిక్ అయి నాకు కూడా పేరొచ్చింది” అని తెలిపారు.

Adipurush : ప్రభాస్ కి నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు.. ముదురుతున్న ఆదిపురుష్ వివాదం..

రోలెక్స్ రోల్ లో మళ్లీ కనిపిస్తారా అని యాంకర్ అడగగా.. ”దానికి కాలమే సమాధానం చెప్తుంది. సమయం వచ్చినప్పుడు దానిగురించి కచ్చితంగా మాట్లాడతాను” అని తెలిపారు. దీంతో మరోసారి రోలెక్స్ పాత్ర కచ్చితంగా కనిపిస్తుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విక్రమ్ 2, ఖైదీ 2 సినిమాలు ఉంటాయని దర్శకుడు లోకేష్ ప్రకటించాడు. ఈ రెండిట్లో రోలెక్స్ పాత్ర కచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.