Ravi Teja : పక్కన కూర్చుంటా అని చెప్పా.. ఇప్పుడు ఏకంగా సంక ఎక్కి కూర్చున్నా.. రవితేజ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ..

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 05:54 PM

Ravi Teja : పక్కన కూర్చుంటా అని చెప్పా.. ఇప్పుడు ఏకంగా సంక ఎక్కి కూర్చున్నా.. రవితేజ!

Ravi Teja : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్‌గా దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాడు. కె బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి తరువాత చిరు మళ్ళీ ఆ తరహా పాత్రలో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

Chiranjeevi : రవితేజతో నటించాలి అంటే కోపం వస్తుంది.. చిరంజీవి!

ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. ‘అన్నయ్య విజేత మూవీ ఫంక్షన్ విజయవాడ పిడబ్ల్యూ గ్రౌండ్స్ లో జరిగింది. నాకు విజయవాడలో ఒక గ్యాంగ్ ఉండేది. వాళ్ళదర్నీ వేసుకొని ఆ ఈవెంట్ కి వెళ్ళాను, అయితే అప్పటికే చిరంజీవి గారు వచ్చేశారు. ఆయన ఎక్కడో ముందు కూర్చొని ఉండడంతో ఆయన్ని చూడలేకపోయాము. మా ఫ్రెండ్స్ అంతా ఫీల్ అయ్యారు. కానీ నేను బాధ పడలేదు. ఆ సమయంలో వాళ్లతో ఒక మాట అన్నాను.

ఇప్పుడు అయన దర్శకుడు, హీరోయిన్ పక్కన కూర్చొని ఉండవచ్చు, కానీ ఒకరోజు నేను చిరంజీవి పక్కన కూర్చుంటా అని చెప్పాను. ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవడం కాదు, ఏకంగా సంక ఎక్కి కూర్చున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే చిరంజీవి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ‘ఎవరు ఏమన్నా భరిస్తారు. అంతేగాని ఎదుట వ్యక్తిని ఏమన్నారు. బాధ పడతారు ఏమో గాని అసలు బయటపడరు. ఇన్నాళ్ల నా పరిచయంలో ఆయన ఒకరి గురించి నెగటివ్ గా మాట్లాడడం నేను విన లేదు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది’ అంటూ ప్రశంసించాడు. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ కేథ‌రిన్ థ్రెసా ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఊర్వశి రౌటెలా స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో చిందేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.