Pawan Kalyan : పవర్ స్టార్ – సుప్రీం హీరో సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసా?

పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తమిళ్ లో ఇది స్లో నెరేషన్ సినిమా అయినప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ కి తగ్గట్టు...............

Kaburulu

Kaburulu Desk

March 1, 2023 | 07:16 AM

Pawan Kalyan : పవర్ స్టార్ – సుప్రీం హీరో సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసా?

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి తమిళ సూపర్ హిట్ సినిమా వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తమిళ్ లో ఈ సినిమా తెరక్కించిన నటుడు, దర్శకుడు సముద్రఖని తెలుగులో కూడా ఈ సినిమాని తానే తెరకెక్కిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తమిళ్ లో ఇది స్లో నెరేషన్ సినిమా అయినప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ కి తగ్గట్టు మార్పులు కూడా చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కేతికశర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, తణికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా, రోహిణి నటించనున్నట్టు సమాచారం. దీంతో భారీ తారాగణాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ కూడా ఉండొచ్చు అని టాక్ నడుస్తుంది.

Kajal Aggarwal : కాజల్ బ్యాక్ టు వర్క్.. ఒకేసారి ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టిందా??

ఇద్దరు హీరోలతో పాటు ఇద్దరు హీరోయిన్స్ కూడా సినిమాలో ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు చిత్రయూనిట్. ఇటీవలే ధమాకా సినిమాతో భారీ హిట్ కొట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.