Nagababu: సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. ఓట్లు గుద్దితే అవుతుంది.. ఫ్యాన్స్‌పై నాగబాబు అసహనం!

Kaburulu

Kaburulu Desk

March 27, 2023 | 08:18 PM

Nagababu: సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. ఓట్లు గుద్దితే అవుతుంది.. ఫ్యాన్స్‌పై నాగబాబు అసహనం!

Nagababu: నటుడు జనసేన నేత నాగబాబు అప్పుడప్పుడు అభిమానులపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. వేదిక ఏదైనా తనలో అసహనం మొదలైతే బయటపెట్టేయడం నాగబాబుకు అలవాటే. అలాగే ఈరోజు కూడా నాగబాబు అభిమానులపై కోప్పడ్డారు. ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అరుస్తుండడంతో నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. సీఎం అని అరిస్తే సరిపోదు.. ఓట్లు గుద్దితే సీఎం అవుతారు. దమ్ముంటే దమ్ముంటే ఎలక్షన్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి అంటూ రెచ్చిపోయారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం రాత్రి నుంచే మొదలయ్యాయి. ఫ్యాన్స్ తో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడారు. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆయన కాస్త అసహనానికి గురయ్యారు. వేదికపై నాగబాబు మాట్లాడుతుండగా.. బాల్కనీలో ఉన్న కొందరు నినాదాలు చేశారు. దీంతో నాగబాబు.. ‘‘మాట్లాడతాను.. కాస్త ఆగండి. ఇలా అల్లరి చేస్తే అసలు కంటెంట్ పోతుంది. ప్లీజ్.. దయచేసి.. దండం పెడతా.. కొంచెం సేపు సైలెంట్ గా ఉండండని కోరారు.

కానీ అభిమానులు మాత్రం ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘మనం ఇవాళ వచ్చింది చరణ్ బర్త్ డే వేడుకలకు కాబట్టి.. మొదట గౌరవం చరణ్ కు ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసేన సైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని చెప్పారు. కానీ అరుపులు, నినాదాలు మాత్రం ఇగలేదు. కొద్దిసేపు నిశబ్దంగా ఉన్న నాగబాబు తర్వాత మాత్రం సహనం కోల్పోయారు.

పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా.. ‘సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎంను చేయాలి’ అని అన్నారు కదా. కాబట్టి సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే ఎలక్షన్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి. అది పవన్ కల్యాణ్ కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికే వచ్చానని నవ్వుతూ.. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కవర్ చేసుకున్నారు.