CCL 2023 : తమ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన అఖిల్, అశ్విన్.. తెలుగు వారియర్స్ విజయం!
సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ చూస్తుంటే ఐపిఎల్ ముందుగానే మొదలైనట్లు ఉంది. ఇటీవలే సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. గత వారం మొదటి మ్యాచ్ ఆడిన తెలుగు వారియర్స్.. ఈ శనివారం (ఫిబ్రవరి 25) సెకండ్ మ్యాచ్ ఆడింది. బెంగాల్ టైగర్స్ తో పోరాటానికి దిగిన తెలుగు వారియర్స్..

CCL 2023 : సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ చూస్తుంటే ఐపిఎల్ ముందుగానే మొదలైనట్లు ఉంది. మన దేశంలో ఎక్కువమంది వీక్షించేవి ఒకటి క్రికెట్ అయితే మరొకటి సినిమా. ఈ రెండిటిని విడివిడిగా అభిమానించే ప్రేక్షకులు, రెండు ఒకటిగా ముందుకు వస్తే అభిమానులకు అంతకన్నా కన్నుల పండగ ఏముంటుంది. ఈ నేపథ్యంతోనే స్క్రీన్ మీద ఫైట్స్ తో విధ్వంసం సృష్టించే హీరోలు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి దిగి బౌండరీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇటీవలే సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మొదలైన సంగతి తెలిసిందే.
Nara Lokesh : నేను బాలకృష్ణ ఫ్యాన్ కాదు, చిరంజీవి ఫ్యాన్.. నారా లోకేశ్!
గత వారం మొదటి మ్యాచ్ ఆడిన తెలుగు వారియర్స్.. ఈ శనివారం (ఫిబ్రవరి 25) సెకండ్ మ్యాచ్ ఆడింది. బెంగాల్ టైగర్స్ తో పోరాటానికి దిగిన తెలుగు వారియర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇక బ్యాటింగ్ కి దిగిన బెంగాల్ టైగర్స్ 10 ఓవర్లుకి 115 పరుగులు చేసింది. బెంగాల్ టైగర్ కెప్టెన్ జిషు (భీష్మ మూవీ విలన్) 36 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన తెలుగు వారియర్స్ తమ విధ్వంసం బ్యాటింగ్ తో అలవోకగా చేజింగ్ చేశారు. ఈ క్రమంలో అఖిల్ మరియు ఓంకార్ తమ్ముడు అశ్విన్ బ్యాటింగ్ తో రెచ్చిపోయారు.
అఖిల్ 26 బంతుల్లో 57 పరుగులు చేయగా, అశ్విన్ 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కాగా అశ్విన్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటె ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో అఖిల్.. మొత్తం 213 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాదు ఎక్కువ సిక్స్ లు కొట్టింది కూడా అఖిల్ అక్కినేని అని సమాచారం. కాగా ఇవాళ కేరళ – కర్ణాటక మధ్య, పంజాబ్ – ముంబై మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. మరి ఇవాళ గెలుపు సాధిస్తారో చూడాలి.
The winning team, ladies and gentlemen! 👏🏽👏🏽@TeluguWarriors1 #A23 #ParleHappyHappy #a23rummy #chalosaathkhelein #LetsPlayTogether #CCL2023 #cricket #celebrity #cricketlovers #celebritycricketleague #cricketmania #cricketnews #cricketlive #filmindustry #media #ccl #bollywood pic.twitter.com/5RR3FAISe3
— CCL (@ccl) February 25, 2023