RRR : ఆస్కార్ స్టేజి పై ఎన్టీఆర్ అండ్ చరణ్ నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్?

నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 13న ఈ అవార్డుల పురస్కారం జరగనుంది. కాగా ఈ అవార్డుల పురస్కారం రోజున వేదిక ఎన్టీఆర్, రామ్ చరణ్.. నాటు నాటు సాంగ్ కి లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Kaburulu

Kaburulu Desk

February 26, 2023 | 11:07 AM

RRR : ఆస్కార్ స్టేజి పై ఎన్టీఆర్ అండ్ చరణ్ నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్?

RRR : టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టార్రర్ చిత్రం ‘RRR’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం ఇండియాతో పాటు ప్రపంచాన్ని కూడా ఆకట్టుకుంది. ఇక సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందించిన నాటు నాటు సాంగ్ వరల్డ్ వైడ్ గా ఎన్నో ప్రభంజనాలు సృష్టించింది. ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగుంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఈ తెలుగు మాస్ నెంబర్ జపాన్, చైనా, అమెరికా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించింది.

CCL 2023 : తమ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన అఖిల్, అశ్విన్.. తెలుగు వారియర్స్ విజయం!

ఇక ఈ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ పాట ఆస్కార్ నామినేషన్స్ లో స్తానం దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే. కాగా మార్చి 13న ఈ అవార్డుల పురస్కారం జరగనుంది. ఈ అవార్డుల పురస్కారం రోజున వేదిక ఎన్టీఆర్, రామ్ చరణ్.. నాటు నాటు సాంగ్ కి లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. నాటు నాటు తో పాటు నామినేషన్స్ లో ఉన్న లిఫ్ట్ మీ అప్, అప్లాజ్ సాంగ్స్ ని ప్రదర్శిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటున్నారు కొందరు. మరి చరణ్, ఎన్టీఆర్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తారా? లేదా? చూడాలి.

ఎం ఎం కీరవాణి కూడా ఈ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కాగా ఆర్ఆర్ఆర్ తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డుని అందుకుంది. ప్రఖ్యాతి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ నామినేషన్స్ లో నిలిచిన RRR.. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, స్పాట్ లైట్ కేటగిరీల్లో అవార్డులు అందుకుంది.