Venkatesh : హిట్-4లో హీరోగా విక్టరీ వెంకటేష్?

Kaburulu

Kaburulu Desk

December 26, 2022 | 07:47 PM

Venkatesh : హిట్-4లో హీరోగా విక్టరీ వెంకటేష్?

Venkatesh : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న కాప్ యూనివర్స్ ‘హిట్’. ఇప్పటికే ఈ మూవీ సిరీస్ లో రెండు చిత్రాలు రాగా, రెండు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. హిట్ – ది ఫస్ట్ కేసులో విశ్వక్ సేన్, సెకండ్ కేసులో అడివి శేషు హీరోలుగా నటించారు. ఇటీవల విడుదలైన హిట్-2 లో తరువాతి రాబోయే మూడో భాగంలో హీరో నాని నటిస్తున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్.

Rana Naidu Teaser : రానా నాయుడు టీజర్.. ఫైర్ మీద ఉన్న వెంకిమామ, రానా.. టీజర్ తోనే దుమ్ము దులిపేశారుగా..

కాగా హిట్-4 లో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వెంకటేష్ ఘర్షణ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి అలరించాడు. అదే రీతిలో దర్శకుడు శైలేష్ కొలను హిట్-4 కోసం వెంకటేష్ పాత్రని డిజైన్ చేస్తున్నాడట. నాని నటిస్తున్న మూడో భాగం చివరిలో వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ వార్తలుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా వెంకటేష్ హీరోగా నటిస్తూ.. చివరిగా F3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాలో అతిధి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం హీరో రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే క్రైమ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ లో విడుదలవుతున్న ఈ సిరీస్ లో వెంకటేష్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు.