Venkatesh : మొన్న కమల్, నిన్న చిరు, నేడు వెంకీ.. మిషన్ గన్‌తో బాక్స్ ఆఫీస్‌కి దడ పుట్టిస్తున్నారు..

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్, వాల్తేరు వీరయ్యలో చిరంజీవి మిషన్ గన్ చేతపట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. తాజాగా మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా మిషన్ గన్ చేత పట్టి బాక్స్ ఆఫీస్ కి దడ పుట్టిస్తున్నాడు.

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 05:22 PM

Venkatesh : మొన్న కమల్, నిన్న చిరు, నేడు వెంకీ.. మిషన్ గన్‌తో బాక్స్ ఆఫీస్‌కి దడ పుట్టిస్తున్నారు..

Venkatesh : ఒకప్పటి స్టార్ హీరోలు అంతా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు. కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ వరుస పెట్టి రూ.100 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టి యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇక విషయానికి వస్తే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ మిషన్ గన్స్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. తాజాగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సినిమాలో మిషన్ గన్ తో బాక్స్ బద్దలు కొట్టేశాడు. ఇప్పుడు మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా మిషన్ గన్ చేత పట్టి బాక్స్ ఆఫీస్ కి దడ పుట్టిస్తున్నాడు.

Venkatesh : హిట్-4లో హీరోగా విక్టరీ వెంకటేష్?

వెంకటేష్ కెరీర్ లోని ల్యాండ్ మార్క్ మూవీ అయిన 75వ సినిమా గురించి ఈ సోమవారం అనౌన్స్ చేశాడు. ఈ మూవీని ‘హిట్’ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. తాజాగా నేడు ఈ చిత్రం టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ‘సైంధవ్‌’ అనే డిఫరెంట్ టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. ఇక ఈ వీడియో చూసిన ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. శైలేష్ కొలను మునపటి చిత్రాలు లాగానే ఈ మూవీ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ మూవీ కథ మొత్తం ఒక డ్రగ్ చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది.

ఆ డ్రగ్ ని జెనిటిక్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే 2 ఏళ్ల లోపు ఉన్న పిల్లల కోసం ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఇక విడుదలైన ట్రైలర్ లో ఈ డ్రగ్ ని చూపించగా, ఆ డ్రగ్ ని కాపాడుకునేందుకు వెంకీ ఒక మిషన్ గన్ తీసుకోని విలన్స్ కోసం ఎదురుచూస్తున్న సీన్ ని చూపించారు. దాదాపు రెండు నిముషాలు పై నిడివి ఉన్న ఈ గ్లింప్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. కాగా ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.