CCL 2023 : మళ్ళీ మన హీరోలు క్రికెట్ బ్యాట్ పెట్టబోతున్నారు.. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ వచ్చేస్తోంది..

ఈ సారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఎనిమిది సినీ పరిశ్రమల మధ్య జరగనుంది. తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబాంగ్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్, చెన్నై థండర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ పేర్లతో ఆయా సినీ పరిశ్రమల మధ్య క్రికెట్ మ్యాచ్ లు............

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 02:48 PM

CCL 2023 : మళ్ళీ మన హీరోలు క్రికెట్ బ్యాట్ పెట్టబోతున్నారు.. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ వచ్చేస్తోంది..

CCL 2023 :  మన దేశంలో సినిమా, క్రికెట్ అంటే చాలామందికి పిచ్చి. సినిమాకి, క్రికెట్ కి అభిమానులు కోట్లల్లో ఉంటారు. అలాంటిది ఆ రెండూ కలిస్తే వేరే లెవల్. అలాంటిదే సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సెలబ్రిటీలు క్రికెట్ ఆడేదే సెలబ్రిటీ క్రికెట్ లీగ్. గతంలో కొన్నేళ్ల క్రితం ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించారు. పలు సినీ పరిశ్రమల మధ్య క్రికెట్ మ్యాచ్ లని నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ని నిర్వహించబోతున్నారు.

ఈ సారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఎనిమిది సినీ పరిశ్రమల మధ్య జరగనుంది. తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబాంగ్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్, చెన్నై థండర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ పేర్లతో ఆయా సినీ పరిశ్రమల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఆ పరిశ్రమలకి చెందిన హీరోలు, నటులు క్రికెట్ ఆడి అలరించనున్నారు.

Chiranjeevi : ఆపదలో ఉన్న పవన్ గుర్తుకు వచ్చి కన్నీరు వచ్చాయి.. చిరంజీవి!

ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమవుతుంది. లీగ్ మ్యాచ్ లు లక్నో, జైపూర్, బెంగుళూరు, జోధ్ పూర్, త్రివేండ్రంలో, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లు మాత్రం హైదరాబాద్ లో జరగనున్నాయి. దీంతో అన్ని సినీ పరిశ్రమల ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ సెలబ్రిటీలు, హీరోయిన్స్, మొత్తం సినీ పరిశ్రమ కూడా ఈ మ్యాచ్ లలో భాగం అవుతారు. మన తెలుగులో అఖిల్, సచిన్ జోషి, ఆదర్శ్, తమన్, తరుణ్, సుధీర్ బాబు.. లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. మరి ఈ సారి మన తెలుగు వారియర్స్ లో ఎవరెవరు ఆడతారో చూడాలి. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచుల కోసం అన్ని సినీ పరిశ్రమల ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.