Rana Naidu Teaser : రానా నాయుడు టీజర్.. ఫైర్ మీద ఉన్న వెంకిమామ, రానా.. టీజర్ తోనే దుమ్ము దులిపేశారుగా..

Kaburulu

Kaburulu Desk

September 24, 2022 | 09:02 AM

Rana Naidu Teaser : రానా నాయుడు టీజర్.. ఫైర్ మీద ఉన్న వెంకిమామ, రానా.. టీజర్ తోనే దుమ్ము దులిపేశారుగా..

Rana Naidu Teaser : ఇటీవల మల్టీస్టారర్స్ వరుసగా వస్తున్నాయి. హీరోలంతా మల్టీస్టారర్స్ కి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా మల్టీస్టారర్స్ తీయండని అడుగుతున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి చేస్తే ఆ ప్రాజెక్టుపై అంచనాలు, అభిమానుల్లో ఆశలు బోలెడన్ని ఉంటాయి. ఇక స్టార్ హీరోలు సైతం సినిమాలే కాకుండా సిరీస్ లు, షోలు చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నారు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం రానా నాయిడు అనే సిరీస్ ని చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు.

ఈ సిరీస్ ప్రకటించిన దగ్గర్నుంచి ఎపుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం భారీగా ఈ రానా నాయిడు వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ టీజర్ ని విడుదల చేసింది. సడెన్ గా ఎలాంటి ప్రమోషన్, అప్డేట్ లేకుండా ఈ టీజర్ రిలీజ్ అవడంతో అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ టీజర్ ని హిందీలో రిలీజ్ చేశారు. సిరీస్ మాత్రం అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Hero Nikhil : అసలు మనకి ఆస్కార్ ఎందుకు.. హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..

ఇక రానా నాయుడు ఈ టీజర్ లో.. రానా, వెంకటేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించినట్టు తెలుస్తుంది. సెలబ్రిటీలకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసే ఓ కిరాయి పర్సన్ గా నెగిటివ్ రోల్ లో రానా కనిపించబోతున్నాడు. ఓ పెద్ద ప్రాబ్లమ్ ని రానా క్రియేట్ చేశాడని తెలియడంతో రానాని ఆపగలిగేది ఒక్కడే అని వెంకటేష్ ని రివీల్ చేశారు. ఇందులో వెంకటేష్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఒక వయసు మళ్ళిన పాత్రలో చాలా పవర్ఫుల్ గా చూపించారు. వీరిద్దరూ ఏదో ఒక దాని కోసం పోటీపడబోతున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్ జైలు నుంచి వచ్చినట్టు, రానాకి తండ్రి క్యారెక్టర్ అయినట్టు చూపించారు. ఇక టీజర్ లాస్ట్ లో రానా వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చి బెదిరించిన సీన్ అయితే టీజర్ కి హైలెట్. ఈ సీన్స్ కనుక థియేటర్ లో పడి ఉంటే బాక్సులు బద్దలయ్యేవి అంటున్నారు అభిమానులు.

టీజర్ లోనే ఈ రేంజ్ ఫైర్ ఉంటే ఇక సిరీస్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అని అంచనాలు పెంచేస్తున్నారు. టీజర్ చూశాక సిరీస్ లో రొమాన్స్, యాక్షన్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా సిరీస్ గా తెరకెక్కించడంతో చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో నటించారు. టీజర్ చూశాక సిరీస్ ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.