Nara Lokesh : నేను బాలకృష్ణ ఫ్యాన్ కాదు, చిరంజీవి ఫ్యాన్.. నారా లోకేశ్!
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ యువ నేత మరియు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ యువ నేత మరియు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. నారా లోకేశ్ ఇటీవల ‘యువగళం’ అంటూ పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం తిరుపతి చేరుకున్న లోకేశ్.. అక్కడి యువతతో ‘హలో లోకేశ్’ అనే కార్యక్రమం నిర్వహించడు. ఈ పేస్ టు పేస్ టాక్ లో నారా లోకేశ్ యువత అడిగిన ప్రశ్నలకు ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు.
RRR : HCA అవార్డ్స్‌లో 4 అవార్డులను అందుకున్న RRR..
ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తే ఆహ్వానిస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరైతే మార్పు ఆశిస్తారో, ఎవరైతే మార్పు కోసం అడుగులు వేయాలని అనుకుంటారో, ఎవరైతే ఆంధ్రులు గర్వపడేలా చేస్తారో.. వారందరికీ మేము తప్పకుండా ఆహ్వానం పలుకుతాం అంటూ బదులిచ్చాడు. ఇక అలాగే మీరు ఎవరు అభిమాని అంటూ అడిగిన ప్రశ్నకు లోకేశ్ ఇచ్చిన జవాబు అందర్నీ ఆశ్చర్య పరిచింది.
అందరూ తన మావయ్య బాలకృష్ణ పేరు చెబుతారు అనుకున్నారు. కానీ లోకేశ్ మాత్రం అందర్నీ షాక్ కి గురి చేస్తూ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని అంటూ బదులిచ్చాడు. చిరంజీవి గారి ప్రతి సినిమా చూస్తా, మొన్న విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా కూడా చూసా. అలాగే నా ముద్దుల మావయ్య బాలకృష్ణ అంటే కూడా ఇష్టం ఆయన ప్రతి సినిమా కూడా చూస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలి అంటే గొప్ప మనసు ఉండాలి. అది నేను పవన్ కళ్యాణ్ దగ్గర చూసాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.