Agent : 3 కోట్ల యాక్షన్ సీక్వెన్స్‌ని స్క్రాప్ చేసిన అఖిల్.. రీ షూట్‌కి ఏజెంట్?

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఏజెంట్'. ఈ మూవీలోని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ఇటీవల పూర్తి చేసినట్లు మూవీ టీం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెన్స్ కి దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు ఈ సీక్వెన్స్ మొత్తాన్ని దర్శకుడు చెత్త బుట్టలో పడేశాడని సమాచారం.

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 05:37 PM

Agent : 3 కోట్ల యాక్షన్ సీక్వెన్స్‌ని స్క్రాప్ చేసిన అఖిల్.. రీ షూట్‌కి ఏజెంట్?

Agent : అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. మొదటి సినిమా నుంచి మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న అఖిల్.. ఈ మూవీతో ఎలా అయినా అది సాధించాలనే ధ్యేయంతో కష్ట పడుతున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Naga Chaitanya : సమ్మర్‌లో ‘కస్టడీ’కి తీసుకుంటా అంటున్న నాగచైతన్య..

కాగా ఈ మూవీలోని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ఇటీవల పూర్తి చేసినట్లు మూవీ టీం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెన్స్ కి దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు ఈ సీక్వెన్స్ మొత్తాన్ని దర్శకుడు చెత్త బుట్టలో పడేశాడని సమాచారం. అవుట్ ఫుట్ తాను అనుకున్నట్లు రాకపోవడంతో మళ్ళీ రీ షూట్ కి వెళ్ళడానికి డైరెక్టర్ సిద్ధమయ్యాడని తెలుస్తుంది. త్వరలోనే మూవీ టీం అరేబియాలోని మస్కట్ నగరానికి వెళుతున్నారని, అక్కడ 15 రోజుల పాటు థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. కాగా ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఈ మూవీకి స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథని అందిస్తున్నాడు. గతంలో వంశీ, సురేంద్ర రెడ్డి కలయికలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో హిట్ పక్కా అని ఫీల్ అవుతున్నారు అక్కినేని అభిమానులు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ లో తెలియజేశారు. మరి ఈ సినిమాతో అఖిల్ మాస్ ఇమేజ్ తో పాటు కెరీర్ కమర్షియల్ హిట్టుని కూడా అందుకుంటాడా అనేది చూడాలి.