Taraka Ratna : నేడు తారకరత్న అంత్యక్రియలు..
సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. దాదాపు 22 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 రాత్రి కన్నుమూశారు. ఈరోజు..

Taraka Ratna : సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. కొంత కాలంగా సినిమాలకి దూరం అవుతూ వస్తున్న తారకరత్న రాజకీయంలో యాక్టీవ్ గా మారారు. ఈ క్రమంలోనే గత నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లారు. ఆ కార్యక్రమంలో నడుస్తూ నడుస్తూనే తారకరత్న కుప్పకూలిపోవడంతో, ఆయనని కుప్పంలోని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే గుండె ఆగిపోవడంతో, సిపిఆర్ చేసి వైద్యులు రక్షించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లకి తరలించారు.
Tarakaratna : నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయిన నటుడు తారకరత్న..
అప్పటి నుంచి కోమాలో ఉన్న తారకరత్నకి వైద్యులు ఎంత ట్రీట్‌మెంట్ ఇచ్చినా అయన ఆరోగ్యంలో పురోగతి లేదు. దాదాపు 22 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 రాత్రి కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ, రాజకీయ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తారకరత్న మరణానికి చింతిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు పలువురు ప్రముఖులు. కాగా తారకరత్న భౌతికకాయాన్ని నిన్న (ఫిబ్రవరి 20) ఆయన ఇంటి వద్దనే ఉంచారు. దీంతో తారకరత్నకు నివాళులు అరిపించేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు ప్రముఖులు నిన్న ఆయన ఇంటికి చేరుకున్నారు.
ఈరోజు ఉదయం అభిమానుల సందర్శనర్థం కోసం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. తారకరత్న పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ కు అంతిమయాత్రగా తీసుకు రాగా.. ఈ యాత్రలో అభిమానులు, కుటుంబసభ్యులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు తారకరత్న భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఏపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి, బాలకృష్ణ దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు.