Unstoppable : పొలిటికల్ హీట్‌తో ముగించిన అన్‌స్టాపబుల్.. ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న బాలయ్య-పవన్ ఎపిసోడ్

తాజాగా బాలయ్య – పవన్ ఎపిసోడ్ పార్ట్ 2ని విడుదల చేశారు. ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఫ్యాన్స్ కి ఇంకొంచెం ముందుగానే ట్రీట్ ఇద్దామని ఫిబ్రవరి 9 రాత్రి రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోనే బాగా వైరల్ అయింది. ఇక ఎపిసోడ్ లో పూర్తిగా..............

Kaburulu

Kaburulu Desk

February 10, 2023 | 07:24 AM

Unstoppable : పొలిటికల్ హీట్‌తో ముగించిన అన్‌స్టాపబుల్.. ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న బాలయ్య-పవన్ ఎపిసోడ్

Unstoppable :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ షో వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో సీజన్ 1 భారీ విజయం సాధించగా సీజన్ 2 కూడా సూపర్ గా సక్సెస్ అయింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇటీవల పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని కూడా రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించిన ఆహా పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయగా అది సరికొత్త రికార్డులని సృష్టించింది. ఆ ఎపిసోడ్ లో మొత్తం సినిమాలు, పర్సనల్ లైఫ్, సరదాలు గురించి మాట్లాడారు.

తాజాగా బాలయ్య – పవన్ ఎపిసోడ్ పార్ట్ 2ని విడుదల చేశారు. ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఫ్యాన్స్ కి ఇంకొంచెం ముందుగానే ట్రీట్ ఇద్దామని ఫిబ్రవరి 9 రాత్రి రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోనే బాగా వైరల్ అయింది. ఇక ఎపిసోడ్ లో పూర్తిగా చాలా వరకు పొలిటికల్ స్టఫ్ ఉండటంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే ఏపీ ప్రభుత్వం పై పంచులు, సెటైర్లు వేశారు, విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి ఏపీ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు, ఏపీ ప్రభుత్వం చేసే పనుల గురించి మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులని బాలయ్య బాబు అభినందించారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా పొలిటికల్ టాపిక్స్ తోనే సాగింది.

దీంతో బాలయ్య-పవన్ తాజాజా ఎపిసోడ్ ఏపీలో పొలిటికల్ హీట్ రేపింది. వైసీపీ నాయకులు ఈ ఎపిసోడ్ చూసి పవన్ కళ్యాణ్ పై, బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు. నేడు కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని విమర్శించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ ఎపిసోడ్ ని వైరల్ చేస్తున్నారు. పవన్ ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడిన వ్యాఖ్యలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Phalana Abbayi Phalana Ammayi : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్.. బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటారా??

ఇక ఈ ఎపిసోడ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ గా ముగిసింది. ఈ షో రెండు సీజన్లతో ప్రేక్షకులని, అభిమానులని బాగా మెప్పించింది. ఈ షోతో ఆహాకి మరింత క్రేజ్ వచ్చింది. మరి సీజన్ 3 ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.