Phalana Abbayi Phalana Ammayi : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్.. బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటారా??
నాగశౌర్య వరుస పరాజయాల తర్వాత ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమాతో పర్వాలేదనిపించాడు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాతో రాబోతున్నాడు. నటుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి దర్శకుడిగా మారి................

Phalana Abbayi Phalana Ammayi : నాగశౌర్య వరుస పరాజయాల తర్వాత ఇటీవలే కృష్ణ వ్రింద విహారి సినిమాతో పర్వాలేదనిపించాడు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాతో రాబోతున్నాడు. నటుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి దర్శకుడిగా మారి నాగశౌర్యతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గతంలోనే నాగశౌర్యతో అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద అనే సినిమాలు తీసి విజయాలు సాధించాడు. దీంతో ఈ సినిమాతో కూడా మరో విజయం సాధించి ఈ కాంబోలో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మాళవికా నాయర్ నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
తాజాగా ఈ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సంజయ్ పీసపాటి, అనుపమ కస్తూరి అనే ఓ అమ్మాయి, అబ్బాయి(హీరో, హీరోయిన్స్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు చూపించారు, ఎవరన్నా అడిగినా వాళ్ళు కేవలం ఫ్రెండ్స్ అనే చెప్తారు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ పుడితే? మరి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నవాళ్ళు పెళ్లిచేసుకుంటారా? అనే కథాంశంతో ఈ సినిమా సాగనున్నట్టు తెలుస్తుంది.
Mahesh Babu : ఆధార్ వెరిఫికేషన్ చేయించుకుంటున్న మహేష్ బాబు..
అవసరాల శ్రీనివాస్ సినిమాలంటే లవ్, స్లో మోషన్, ఎమోషన్స్ ఉండేలా ఉంటాయి. దీంతో ఈ సినిమా కూడా అదే ఫ్లోలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అవసరాల శ్రీనివాస్-నాగశౌర్య మరో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.