Tarakaratna : నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయిన నటుడు తారకరత్న..

కొన్ని రోజులుగా తారకరత్న నారా లోకేశ్ వెంటే ఉంటూ టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా కుప్పంలో నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో..................

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 02:13 PM

Tarakaratna : నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయిన నటుడు తారకరత్న..

Tarakaratna :  ఒకటో నెంబర్ కుర్రాడు లాంటి సినిమాలతో ఒకప్పుడు హీరోగా మెప్పించిన నటుడు తారకరత్న ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ విలన్ గా, నటుడిగా కొన్ని సినిమాలు చేస్తూ ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు తారకరత్న. అయితే గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.

కొన్ని రోజులుగా తారకరత్న నారా లోకేశ్ వెంటే ఉంటూ టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. తాజాగా కుప్పంలో నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో నటుడు తారకరత్న కూడా పాల్గొన్నాడు. నారా లోకేశ్ తో కలిసి నడుస్తుండగా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో కార్యకర్తలు తారకరత్నని హుటాహుటిన కుప్పంలోని ఓ హాస్పిటల్ కి తరలించారు.

Breaking : Jamuna : సీనియర్ నటి జమున కన్నుమూత..

టీడీపీ నాయకులు దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం వైద్యులు ICUలో చికిత్స అందిస్తున్నారు. డీహైడ్రేషన్ కి గురయ్యి, తోపులాట వల్ల గుండెపోటు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారు. నాలుగు రోజులుగా విశ్రాంతి లేకుండా నారా లోకేశ్ తో కలిసి పర్యటనలు చేస్తున్నారు. అందుకే ఇలా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. తారక్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయనని పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే తారక్ కోలుకుంటాడు అని తెలిపారు. దీంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.