Taraka Ratna : తారకరత్న మరణాన్ని చంద్రబాబు దాచిపెట్టాడు.. లక్ష్మీ పార్వతి!

తారకరత్న మరణం గురించి లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేసింది. తారకరత్న ఎప్పుడో మరణించాడు అని చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసం ఇన్నాళ్లు దాచి ఉంచాడు అంటూ వెల్లడించింది.

Kaburulu

Kaburulu Desk

February 20, 2023 | 11:30 AM

Taraka Ratna : తారకరత్న మరణాన్ని చంద్రబాబు దాచిపెట్టాడు.. లక్ష్మీ పార్వతి!

Taraka Ratna : సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. కొంత కాలంగా సినిమాలకి దూరం అవుతూ వస్తున్న తారకరత్న రాజకీయంలో యాక్టీవ్ గా మారారు. ఈ క్రమంలోనే గత నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లారు. ఆ కార్యక్రమంలో నడుస్తూ నడుస్తూనే తారకరత్న కుప్పకూలిపోవడంతో, ఆయనని కుప్పంలోని హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే గుండె ఆగిపోవడంతో, సిపిఆర్ చేసి వైద్యులు రక్షించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లకి తరలించారు.

Taraka Ratna : నేడు తారకరత్న అంత్యక్రియలు..

అప్పటి నుంచి కోమాలో ఉన్న తారకరత్నకి వైద్యులు ఎంత ట్రీట్‌మెంట్ ఇచ్చినా అయన ఆరోగ్యంలో పురోగతి లేదు. దాదాపు 22 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 రాత్రి కన్నుమూశారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కాగా సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తారకరత్న మరణం గురించి సంచలన ఆరోపణలు చేసింది. తారకరత్న ఎప్పుడో మరణించాడు అని చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసం ఇన్నాళ్లు దాచి ఉంచాడు అంటూ వెల్లడించింది.

‘హార్ట్ ఎటాక్ వచ్చిన రోజునే గుండె ఆగిపోయింది అని డాక్టర్లు తెలియజేశారు. కానీ మళ్ళీ గుండె కొట్టుకుంటుంది అని చంద్రబాబు ఒక డ్రామా ప్లే చేశాడు. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజునే ఇటువంటి దుర్ఘటన జరిగింది అంటే, దాని వాళ్ళ లోకేష్ కి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనే భయం. ఈ విషయాన్ని ఇన్నిరోజులు దాచి పెట్టడం వల్ల తారకరత్న భార్య, పిల్లలు ఎంత బాధ పడి ఉంటారు. నా భర్తని కూడా అలాగే బాధ పెట్టాడు ఆ చంద్రబాబు’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఏపీ రాకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కాగా తారకరత్న అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈరోజు ఉదయం అభిమానుల సందర్శనర్థం కోసం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు తారకరత్న భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.