NTR 30 : తుఫాన్ కి సిద్దమైన ఎన్టీఆర్.. NTR 30 ముహూర్తం ఫిక్స్

మార్చ్ లో సినిమా మొదలవుతుందని గతంలో ఓ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు. తాజాగా ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ సినిమా ఓపెనింగ్ ని ప్రకటించింది...............

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 07:52 AM

NTR 30 : తుఫాన్ కి సిద్దమైన ఎన్టీఆర్.. NTR 30 ముహూర్తం ఫిక్స్

NTR 30 :  RRR తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు ప్రకటించాడు. కొరటాల శివతో ఎన్టీఆర్ 30వ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా తారకరత్న మరణించడం, ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలకు వెళ్లి రావడంతో ఈ సినిమా ఓపెనింగ్ లేట్ అయింది.

ఇప్పటికే ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ప్రకటించారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇటీవలే ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలకు వెళ్లి తిరిగి రావడంతో సినిమా మొదలవ్వబోతుంది. మార్చ్ లో సినిమా మొదలవుతుందని గతంలో ఓ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు. తాజాగా ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ సినిమా ఓపెనింగ్ ని ప్రకటించింది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NTR 30 సినిమా పూజా కార్యక్రమం మార్చ్ 23న జరగనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లుగా ఎదురుచూసిన ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Kabjaa Review : కబ్జ.. కథ వేరు కథనం మాత్రం KGF.. ఉపేంద్ర మెప్పించాడా?

ఇక సినిమా పూజా కార్యక్రమానికి జాన్వీ కపూర్ కూడా రాబోతుందని సమాచారం. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ ని ఏప్రిల్ లో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.