Kabjaa Review : కబ్జ.. కథ వేరు కథనం మాత్రం KGF.. ఉపేంద్ర మెప్పించాడా?

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, హీరోయిన్ శ్రియ జంటగా చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కబ్జ. కన్నడ స్టార్లు సుదీప్, శివరాజ్ కుమార్ లు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా కబ్జ నేడు మార్చ్ 17న రిలీజయింది.....................

Kaburulu

Kaburulu Desk

March 17, 2023 | 02:10 PM

Kabjaa Review : కబ్జ.. కథ వేరు కథనం మాత్రం KGF.. ఉపేంద్ర మెప్పించాడా?

Kabjaa Review :  కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, హీరోయిన్ శ్రియ జంటగా చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కబ్జ. కన్నడ స్టార్లు సుదీప్, శివరాజ్ కుమార్ లు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా కబ్జ నేడు మార్చ్ 17న రిలీజయింది. సినిమా ప్రమోషన్స్ ని మాత్రం చిత్రయూనిట్ భారీగా చేసింది. టీజర్స్, ట్రైలర్స్ చూసి ఇది KGF లా ఉండబోతుంది ముందు నుంచి అంతా ఊహించారు.

ఇక కబ్జ సినిమా కథ ఇషయానికి వస్తే.. హీరో ఉపేంద్ర అన్నయ్య మాఫియా వాళ్ళు అన్యాయంగా ఒకర్ని చంపేస్తే వాళ్లకి ఎదురు తిరిగి ఓ మాఫియా లీడర్ కొడుకుని చంపేయడంతో మాఫియా వాళ్ళు ఉపేంద్ర అన్నయ్యని చంపేస్తారు. దీంతో ఉపేంద్ర తన అన్నని చంపిన వాళ్ళని, వాళ్ళ మనుషులని చంపుకుంటూ వెళ్తాడు. దీంతో అతనికి తెలియకుండానే ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేయాల్సిన వాడు మాఫియా లీడర్ గా మారతాడు. ఇది సాధారణ రివెంజ్ స్టోరీ.

అయితే ఈ మాములు స్టోరీకి KGF ఎలివేషన్స్ ఇచ్చి, టేకింగ్, ఫ్రేమ్స్, కొన్ని చోట్ల మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ KGF సినిమానే తలిపించాయి. కొన్ని సీన్స్ లో అయితే KGF సినిమానే చూసినట్టు అనిపిస్తుంది ప్రేక్షకులకు. ఇటీవల KGF లాగే సినిమాలు తీస్తున్నారు కొంతమంది. కానీ అవి KGF లాగా కథ, కథనంలో స్ట్రాంగ్ లేకపోవడంతో ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నాయి. ఇప్పుడు కబ్జ కూడా అదే తోవలో వెళ్ళింది.

Custody Teaser : నిజం… నా కస్టడీలో.. నాగచైతన్య మాస్ యాక్షన్ ‘కస్టడీ’ సినిమా టీజర్ రిలీజ్..

ఇక కబ్జ సినిమాలో సుదీప్ ఒక 5 నిముషాలు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడు. చివర్లో శివరాజ్ కుమార్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడంతో కబ్జ2 అంటూ సినిమా అర్దాంతరంగా ముగుస్తుంది. మరి కబ్జ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.