Oscasr 2023 : ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎన్టీఆర్, చరణ్ కాదు.. మరెవరో తెలుసా?

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన నాటు నాటు పాటని.. ఆస్కార్ వేదిక పై ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో నిజం లేదంటూ ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా..

Kaburulu

Kaburulu Desk

March 11, 2023 | 06:01 PM

Oscasr 2023 : ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎన్టీఆర్, చరణ్ కాదు.. మరెవరో తెలుసా?

Oscasr 2023 : టాలీవుడ్ ఆడియన్స్ ఊహల్లో కూడా లేని ఆలోచన.. మన తెలుగు సినిమా ఆస్కార్ వరకు చేరుకోవడం. అలాంటిది నేడు ఆస్కార్ రేస్ లో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే స్థాయికి దర్శకధీరుడు రాజమౌళి తీసుకు వచ్చాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ ప్రీ ఇండిపెండెన్స్ మూవీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోనే నాటు నాటు సాంగ్ అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇంతటి ప్రజాధారణ పొందడంతో సొంతంగా ఆస్కార్ బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

RRR : RRR ‎ని పొగిడినప్పుడు ఒక్కడు మాట్లాడాల, కానీ ఇప్పుడు.. తమ్మారెడ్డి రియాక్షన్!

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన ఈ పాటని.. ఆస్కార్ వేదిక పై ఎన్టీఆర్, రామ్ చరణ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలో నిజం లేదంటూ ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆస్కార్ స్టేజి పై చేయడానికి మాకు రిహార్సల్స్ కి టైం కుదరలేదు అంటూ వెల్లడించాడు. దీంతో ఈ సాంగ్ ని మరెవరు పర్ఫార్మ్ చేయబోతున్నారు అంటూ సస్పెన్స్ నెలకుంది. తాజాగా ఈ విషయం ఒక క్లారిటీ వచ్చేసింది.

ప్రభుదేవా నటించిన ABCD మూవీలో యాక్ట్ చేసిన అమెరికన్ డాన్సర్ ‘లారెన్ గోట్లిబ్’ నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసింది. ”ఆస్కార్ వేదిక పై నేను నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నా. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇదే స్టేజి పై నాటు నాటు స్వరకర్త కీరవాణి.. సింగర్స్ రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Lauren Gottlieb (@laurengottlieb)