Sushanth : లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుశాంత్.. మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్..

ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు సుశాంత్. ఆ తర్వాత మా నీళ్ల ట్యాంక్ అనే సిరీస్ తో మెప్పించాడు. ఇక అలవైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ ఓ ముఖ్య పాత్రలో మెప్పించి..........

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 08:21 AM

Sushanth : లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుశాంత్.. మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్..

Sushanth :  అక్కినేని కుటుంబం నుంచి వచ్చి సుశాంత్ హీరోగా కొన్ని సినిమాలు చేసి మెప్పించాడు. ఆ తర్వాత కెరీర్ కి గ్యాప్ రావడం, కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడంతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు సుశాంత్. ఓ పక్కన హీరోగా సినిమాలు, సిరీస్ లు చేస్తూనే మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ మెప్పిస్తున్నాడు.

ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు సుశాంత్. ఆ తర్వాత మా నీళ్ల ట్యాంక్ అనే సిరీస్ తో మెప్పించాడు. ఇక అలవైకుంఠపురంలో సినిమాలో సుశాంత్ ఓ ముఖ్య పాత్రలో మెప్పించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్పెషల్ రోల్స్ తెచ్చుకోవటంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ రోల్ పట్టేశాడు సుశాంత్.

తాజాగా శనివారం (మార్చ్ 18) నాడు సుశాంత్ పుట్టిన రోజు కావడంతో చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమా సుశాంత్ కి విషెస్ చెప్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాలో ఒక స్పెషల్ లవర్ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రేమికులు ఆశ్చర్యపోయారు. మెగాస్టార్ సినిమాలో సుశాంత్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు.

NTR 30 : తుఫాన్ కి సిద్దమైన ఎన్టీఆర్.. NTR 30 ముహూర్తం ఫిక్స్

ఇక ఇదే విషయాన్ని సుశాంత్ కూడా షేర్ చేసుకుంటూ.. ఈ సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గారితో కలిసి నటించడం నా అదృష్టం. ఆయనకు ఒక ఫ్యాన్ గా చాలా సంతోషిస్తున్నాను అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సంవత్సరం దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తారని సమాచారం.