Balakrishna-Pawan Kalyan : బాలయ్య-పవన్ అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. పొలిటికల్ ఎపిసోడ్.. రిలీజ్ తర్వాత ఏపీలో రచ్చ రచ్చే..

ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ షో వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో సీజన్ 1 భారీ విజయం సాధించగా సీజన్ 2 కూడా సూపర్ గా సక్సెస్ అయింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో............

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 08:38 PM

Balakrishna-Pawan Kalyan : బాలయ్య-పవన్ అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. పొలిటికల్ ఎపిసోడ్.. రిలీజ్ తర్వాత ఏపీలో రచ్చ రచ్చే..

Balakrishna-Pawan Kalyan :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ షో వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో సీజన్ 1 భారీ విజయం సాధించగా సీజన్ 2 కూడా సూపర్ గా సక్సెస్ అయింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని ఓ రేంజ్ లో నిలబెట్టారు. బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి బాలయ్య అభిమానులు, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించిన ఆహా పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయగా ఇది సరికొత్త రికార్డులని సృష్టించింది. ఈ ఎపిసోడ్ మొత్తం బాలయ్య – పవన్ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు.

తాజాగా బాలయ్య – పవన్ ఎపిసోడ్ కి సంబంధించి పార్ట్ 2 ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ప్రోమో ట్రేండింగ్ లో ఉంది. ఈ ప్రోమో చూసిన తర్వాత ఎపిసోడ్ కచ్చితంగా పొలిటికల్ ఎపిసోడ్ అవ్వనుందని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య పొలిటికల్ కి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ప్రోమోలో.. బాలయ్య.. పవన్ ఎక్కువగా జేబులో చేతులు పెట్టుకుంటున్నావు? ఎవర్ని కొట్టకుండా ఆపుకోవడానికా అని అడిగారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళేటప్పుడు కార్ మీద కూర్చొని వెళ్లగా అది వైరల్ అయింది. ఆ ఫోటో చూపించి బాలయ్య దాని గురించి అడగగా పవన్ కార్ లో వెళ్లొద్దు, కార పైన వెళ్లొద్దు, బయటకి రాకూడదు.. చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటూ ఏపీ ప్రభుత్వంపై డైరెక్ట్ గానే కౌంటర్లు వేసి అధికార యంత్రంగం హద్దులు దాటుతుందని అన్నారు. అలాగే బాలయ్య.. అసలు పార్టీ ఎందుకు స్టార్ట్ చేశావు? తెలుగుదేశంలో జాయిన్ అవ్వొచ్చుగా అని డైరెక్ట్ గా అడగటంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. నీ మ్యానిఫెస్టో జనాల్లోకి వెళ్ళలేదు ఏమో, నీ ఫ్యాన్స్ ని ఓట్లుగా ఎందుకు మలుచుకోలేకపోతున్నావు? నువ్వేం తప్పు చేశావని నీ మీద కేసులు పెట్టారు? అని బాలకృష్ణ ఇలా వరుసగా అన్ని పొలిటికల్ సంబంధించి ప్రశ్నలు అడిగాడు. మరి వీటికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానాలు చెప్పాడో తెలియాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

Unstoppable with NBK: పవన్ ఎపిసోడ్‌లో నోరు జారిన బాలయ్య.. క్షమాపణ చెప్పాలని నర్సుల డిమాండ్

ప్రోమోలో చివర్లో డైరెక్టర్ క్రిష్ కూడా వచ్చాడు. దీంతో హరిహరవీరమల్లు సినిమా గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రోమోలో పూర్తిగా పొలిటికల్ అంశాలు ఉండటంతో ఎపిసోడ్ లో కూడా మొత్తం పొలిటికల్ స్టఫ్ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. దీంతో బాలయ్య-పవన్ ఎపిసోడ్ పార్ట్ 2 కోసం బాలయ్య అభిమానులు, పవన్ అభిమానులతో పాటు ఏపీ నాయకులు కూడా ఎదురు చేసుతున్నారు. ఈ ఎపిసోడ్ రిలీజయితే ఏపీలో పక్కాపోలిటికల్ హీట్ రేగుతుంది అని భావిస్తున్నారు అంతా. మరి ఈ ఎపిసోడ్ చూసి వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ఆహా టీం ప్రకటించింది.