Waltair Veerayya : సంక్రాంతి బరి అయిపోయింది.. ఇప్పుడు ఓటీటీ బరిలోకి దిగబోతున్న మెగాస్టార్..
వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. మెగాస్టార్ కి మాస్ మహారాజ్ తోడవడంతో ఈ సినిమాకి దాదాపు 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక సంక్రాంతి బరిలో హిట్ అయిన ఈ సినిమా థియేటరికల్ రన్ ని ముగించుకొని త్వరలో ఓటీటీలోకి రానుంది. టాప్ ఓటీటీ...................

Waltair Veerayya : చిరంజీవి, రవితేజ కలిసి ఈ సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, క్యాథరిన్, బాబీ సింహ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూపించి కామెడీ, యాక్షన్, డ్యాన్స్.. ఇలా అన్ని కమర్షియల్ హంగులతో వచ్చి సంక్రాంతి పండగకు అభిమానులని, ప్రేక్షకులని మెప్పించారు.
వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయి భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. మెగాస్టార్ కి మాస్ మహారాజ్ తోడవడంతో ఈ సినిమాకి దాదాపు 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక సంక్రాంతి బరిలో హిట్ అయిన ఈ సినిమా థియేటరికల్ రన్ ని ముగించుకొని త్వరలో ఓటీటీలోకి రానుంది. టాప్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ తాజాగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా తమ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో చిరు, రవితేజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ స్పెషల్ ఆఫర్.. ఆడవాళ్లందరికి ఈ సినిమా ఫ్రీ షోలు..
థియేటర్స్ లో ఇప్పటికే పలు రికార్డులు సాధించిన వాల్తేరు వీరయ్య ఓటీటీలో ఎలాంటి రికార్డులు కొడుతుందో చూడాలి మరి. ఓటీటీలోకి రాగానే ఈ మాస్ కమర్షియల్ సినిమా మళ్ళీ చేసేయాలని చిరు, రవితేజ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB
— Netflix India South (@Netflix_INSouth) February 7, 2023