Das Ka Dhamki : రిలీజ్ రోజు విశ్వక్‌సేన్ సినిమా కోసం థియేటర్‌కి వెళ్తే.. రవితేజ సినిమా వేశారు..

నేడు దాస్ కా ధమ్కీ సినిమా రిలీజ్ అవ్వగా ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో విశ్వక్ ఇంకో హిట్ కొట్టేశాడని అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో విశ్వక్ దాస్ కా ధమ్కీ సినిమా సందడి చేస్తుంది. అయితే వైజాగ్ లోని ఓ థియేటర్ లో దాస్ కా ధమ్కీ సినిమా చూద్దామని వెళ్తే..............

Kaburulu

Kaburulu Desk

March 22, 2023 | 02:53 PM

Das Ka Dhamki : రిలీజ్ రోజు విశ్వక్‌సేన్ సినిమా కోసం థియేటర్‌కి వెళ్తే.. రవితేజ సినిమా వేశారు..

Das Ka Dhamki :  విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ జంటగా విశ్వక్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దాస్ కా ధమ్కీ. మొదటి సారి విశ్వక్ పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉగాది నాడు రిలీజయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొచ్చి నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అంటూ విశ్వక్ హడావిడి చేయడంతో విశ్వక్ అభిమానులతో పాటు, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూశారు.

నేడు దాస్ కా ధమ్కీ సినిమా రిలీజ్ అవ్వగా ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో విశ్వక్ ఇంకో హిట్ కొట్టేశాడని అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో విశ్వక్ దాస్ కా ధమ్కీ సినిమా సందడి చేస్తుంది. అయితే వైజాగ్ లోని ఓ థియేటర్ లో దాస్ కా ధమ్కీ సినిమా చూద్దామని వెళ్తే ధమాకా సినిమా వేసి ఆశ్చర్యపరిచారు థియేటర్ నిర్వాహకులు. దీంతో ఇది వైరల్ గా మారింది.

Niharika-Chaitanya : మెగా జంట నిహారిక, చైతన్య విడిపోతున్నారా? వైరల్ అవుతున్న న్యూస్..

వైజాగ్ లోని సుకన్య థియేటర్ లో మార్కింగ్ షోకి అభిమానులు, ప్రేక్షకులు దాస్ కా ధమ్కీ సినిమా చూద్దామని వెళితే రవితేజ ధమాకా సినిమాని వేశారు. దీంతో సినిమాకి వచ్చిన వాళ్ళు మొదట ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఇదేంటని థియేటర్లో గోల పెట్టారు. దీంతో ఆపరేటర్ తన తప్పుని గ్రహించి వెంటనే దాస్ కా ధమ్కీ సినిమాని వేశాడు. అయితే ఈ లోపే ఇది వీడియో రూపంలో వైరల్ గా మారింది. దాస్ కా ధమ్కీ సినిమాకోసం వెళ్తే ధమాకా వేయడమేంటని నెటిజన్లు, అభిమానులు ఆ థియేటర్ యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తున్నారు.