Chiranjeevi : ‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం నటనకు.. చిరు, చరణ్ సత్కారం!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తీసుకోని ఆడియన్స్ ముందుకు 'రంగమార్తాండ' సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ముగ్దులవుతున్నారు. తాజాగా చిరంజీవి..

Kaburulu

Kaburulu Desk

March 23, 2023 | 08:14 PM

Chiranjeevi : ‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం నటనకు.. చిరు, చరణ్ సత్కారం!

Chiranjeevi : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తీసుకోని ఆడియన్స్ ముందుకు ‘రంగమార్తాండ’ సినిమాతో వచ్చాడు. మరాఠి చిత్రం ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్ గా తెరకెక్కింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించగా.. బ్రహ్మానందం ఒక ముఖ్య పాత్రలో కనిపించాడు. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, వంశీ చాగంటి నటీనటులు కూడా ఈ సినిమాలో నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం తన గొంతుని సవరించాడు.

Kushi : ఖుషి రిలీజ్ రెడీ.. విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

ఉగాది కానుకగా మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో అంటే ప్రతి ఒక్క నటుడు అద్భుతంగా చేయాల్సిందే. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా బ్రహ్మానందం యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ముగ్దులవుతున్నారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కర్ని నవ్విస్తూ వచ్చిన హాస్యబ్రహ్మ ఈ సినిమాలో సీరియస్ రోల్ లో ఏడిపించేశాడు. థియేటర్ లో బ్రహ్మానందం సీన్లకు ప్రతీ ఒక్కరు కన్నీళ్లు పెట్టుకొనేలా బ్రహ్మి జీవించేశాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం నటనకి నేషనల్ అవార్డు వచ్చిన ఆశ్చర్య పడనవసరం లేదు అంటున్నారు ఆడియన్స్.

Das Ka Dhamki Review : దాస్ కా ధమ్కీ.. కథ, ట్విస్టులు ఊహించొచ్చు.. కానీ మంచి స్క్రీన్ ప్లేతో అదరగొట్టిన విశ్వక్సేన్..

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం నటనకి చిరంజీవి కూడా ఫిదా అయ్యిపోయాడు. దీంతో చిరంజీవి కుటుంబ సమేతంగా బ్రహ్మానందాన్ని శాలువాతో సత్కరించారు. ఈ సత్కారం రామ్ చరణ్ RC15 షూటింగ్ లో జరిగింది. రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ , కూతురు శ్రీజ, హైపర్ ఆది, వెన్నల కిషోర్ బ్రహ్మానందాన్ని అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఆడియన్స్ నుంచి రంగమార్తాండ సినిమా మంచి మార్కులు అయితే వస్తుండడం చూస్తుంటే.. కృష్ణవంశీ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.