Ginger Garlic Paste : అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలనుకుంటున్నారా?? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

మనం బయటిది వాడకుండా ఇంట్లో ప్రతిసారి చేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒకసారి చేసుకొని కొన్ని చిట్కాలను పాటించి దానిని ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవచ్చు............

Kaburulu

Kaburulu Desk

February 7, 2023 | 03:25 PM

Ginger Garlic Paste : అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిలువ ఉండాలనుకుంటున్నారా?? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Ginger Garlic Paste : అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం నాన్ వెజ్ కూరల్లో, బిర్యానీ, కుర్మా కూరల్లో.. ఇలా రకరకాల వంటల్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. ఇది మన ఆరోగ్యానికి మంచిది మరియు దీనివల్ల కూర రుచిగా కూడా ఉంటుంది. అందుకు చాలా మంది ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటారు. లేదా బయట మార్కెట్ లో దొరికేది వాడుకుంటారు. అయితే మనం బయటిది వాడకుండా ఇంట్లో ప్రతిసారి చేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒకసారి చేసుకొని కొన్ని చిట్కాలను పాటించి దానిని ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో చేసిన దానినే వంటల్లో వాడుకోవచ్చు.

జిప్ లాక్ బ్యాగ్స్ ను వాడుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని నిలువ ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఉపయోగించేటప్పుడు అవి డ్యామేజ్ (రంద్రాలు పడడం లేదా చిరిగడం) లేకుండా చూసుకోవాలి. జిప్ లాక్ బ్యాగ్స్ లో పెట్టి ఉంచుకుంటే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు దానిలో కొద్దిగా ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి మిక్సి పట్టాలి. ఇది వాడేటప్పుడు కూరలో తక్కువ ఉప్పు, నూనె వేయాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది.

Tulasi Leaves : తులసి ఆకులను తినొచ్చు కూడా.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా వైట్ వెనిగర్ కలపాలి. ఇది కలపడం వలన కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎయిర్ టైట్ కంటైనర్లు వంటి వాటిలో పెట్టినా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. గాజు సీసాలలో ఉంచినా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. కాకపోతే వీటిని మరీ ఎక్కువ రోజులు ఉంచకుండా వాడాలి. ఇలా మనం ఎలాంటి రసాయనాలు కలపకుండా ఎప్పుడూ తరచుగా ఉపయోగించే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పైన చెప్పిన వాటిలో దేనినైనా ఉపయోగించి ఫ్రిజ్ లో పెట్టకుండా కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవచ్చు.