Cooking Gas : ఈ టిప్స్ ఫాలో అయి వంట గ్యాస్ ఆదా చేసుకోండి..
ఒకప్పుడు ఇంట్లో వంట వండడానికి మనం కర్రల పొయ్యి, బొగ్గుల కుంపటి, కిరోసిన్ పొయ్యి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ స్టౌలు, వంట గ్యాస్ లు వాడుతున్నారు. చాలా మందికి వంట గ్యాస్......................

Cooking Gas : ఒకప్పుడు ఇంట్లో వంట వండడానికి మనం కర్రల పొయ్యి, బొగ్గుల కుంపటి, కిరోసిన్ పొయ్యి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ స్టౌలు, వంట గ్యాస్ లు వాడుతున్నారు. చాలా మందికి వంట గ్యాస్ నెల రోజుల్లో అయిపోతుంది. అసలే ఇప్పుడు వంట గ్యాస్ ధర ఎక్కువగా ఉంది. కొన్ని టిప్స్ వాడి వంట గ్యాస్ తక్కువగా అయ్యేలా, గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ కి రెండు బర్నర్ లు ఉంటాయి. ఒకటి పెద్దది, రెండవది చిన్నది మనం వంట వండడానికి ఎక్కువగా చిన్న బర్నర్ ని వాడాలి. పెద్ద బర్నర్ ని ఎక్కువ వంట చేయడానికి ఉపయోగించాలి. మనం వంట వండేటప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టిన తరువాత స్టవ్ ఆన్ చేయాలి.
స్టవ్ పైన వండేటప్పుడు ఎక్కువగా ప్రెషర్ కుక్కర్ లో వండాలి అప్పుడు వంట తొందరగా అవుతుంది. ఇంకా ఆహారంలోని పోషకాలు అందులోనే ఉంటాయి. మనం విడిగా గ్యాస్ మీద వండేటప్పుడు గిన్నెపైన మూత పెట్టాలి. మనం వండేటప్పుడు గ్యాస్ మీద పాత్ర పెట్టిన తరువాత ఇంకొక పాత్ర పెట్టడానికి ఎక్కువ టైం తీసుకోకూడదు. వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకుండా ఒక పాత్ర తీసిన వెంటనే ఇంకొక పాత్ర పెట్టేవిధంగా ఉండాలి. అప్పుడు గ్యాస్ ఆదా అవుతుంది. ఫ్రిజ్ లో ఉన్న వాటిని తీసుకొని వండేటప్పుడు వాటి కూలింగ్ తగ్గిన తరువాత వండుకోవాలి అప్పుడే గ్యాస్ తక్కువ అవుతుంది.
AC : ఎండాకాలంలో AC బిల్ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
పాన్ పై దోసెలు వేసేటప్పుడు లాస్ట్ ది వేసుకునే ముందే స్టవ్ ఆఫ్ చేసి వేసినా దోసె రెడీ అవుతుంది. అలాగే ఏమైనా గొట్టాలు, వడియాలు వేయించుకునేటప్పుడు లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోవచ్చు. మాన్తా వచ్చే బర్నర్ లో ఉన్న హోల్స్ లో వేస్ట్ ఏమి పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పడినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అప్పుడే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అన్నం వండుకునేటప్పుడు బియ్యం కాసేపు నానిన తరువాత వండుకోవాలి. పప్పులు వండుకునేటప్పుడు పప్పును ఎక్కువసేపు నానబెట్టాలి. అప్పుడు గ్యాస్ ఎక్కువగా అవ్వదు. ఇలాంటి టిప్స్ వాడి గ్యాస్ ని ఇంకొంచెం ఎక్కువ రోజులు వచ్చేలా చూసుకోవచ్చు.