20 Hajj pilgrims killed: ఘోర రోడ్డు ప్రమాదం.. హజ్ యాత్రికుల బస్సుకు బోల్తా.. 20 మంది సజీవ దహనం!

Kaburulu

Kaburulu Desk

March 28, 2023 | 01:14 PM

20 Hajj pilgrims killed: ఘోర రోడ్డు ప్రమాదం.. హజ్ యాత్రికుల బస్సుకు బోల్తా.. 20 మంది సజీవ దహనం!

20 Hajj pilgrims killed: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. హజ్ యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు యాసిర్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సౌదీ వార్తాపత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలోని అసిర్‌ ప్రావిన్స్‌ లోగల అకాబత్‌ షార్‌ రహదారిపై సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యాత్రికుల బస్సు ఖమీస్‌ ముషైత్‌ నుంచి అభాకు వెళ్తోంది. ఆ సమయంలో బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. దేశంలోని నైరుతి ప్రాంతంలో అసిర్ ప్రావిన్సును, అభా నగరాన్ని కలిపే రహదారిపై జరిగిందీ ఘటన. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి.

ఈ దుర్ఘటనలో 20 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది గాయపడ్డారు. బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రయాణికులు ఉమ్రా కోసం మక్కా మసీదుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాచక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

కాగా, రంజాన్‌ మాసం తొలి వారంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. రంజాన్‌ మాసాన్ని అక్కడి ప్రజలు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తుంటారు. ఈ మాసంలో అక్కడి ప్రజలు ముఖ్యంగా హజ్‌ యాత్రకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే రంజాన్ నెల మొదటి వారం కావడంతో మక్కాను దర్శించుకునేందుకు వెళ్తే భక్తులతో రహదారులు రద్దీగా మారాయి.