AC : ఎండాకాలంలో AC బిల్ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ఎండాకాలం రాగానే చాలా మంది AC లు వాడుతుంటారు. AC వాడితే రెగ్యులర్ గా వచ్చే కరెంట్ బిల్ కంటే కూడా ఎక్కువగా వస్తుంది. అయితే కరెంటు బిల్ తక్కువగా వచ్చేలా చేయడానికి కొన్ని టిప్స్ పాటించాలి...........

AC Tips in Summer : ఎండాకాలం రాగానే చాలా మంది AC లు వాడుతుంటారు. AC వాడితే రెగ్యులర్ గా వచ్చే కరెంట్ బిల్ కంటే కూడా ఎక్కువగా వస్తుంది. అయితే కరెంటు బిల్ తక్కువగా వచ్చేలా చేయడానికి కొన్ని టిప్స్ పాటించాలి. ఈ టిప్స్ కొన్ని పాటించి కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు.
*మన అందరికీ తెలిసిన విషయం AC ఉన్న రూమ్ క్లోజ్ గా ఉంచాలి. ఆ రూమ్ లో సీలింగ్ ఉండాలి కిటికీలకు, తలుపులకు కర్టైన్స్ ఉండాలి. దీని వలన తొందరగా రూమ్ చల్లబడుతుంది. ఎక్కువసేపు AC ఆన్ లో ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి బిల్ తక్కువగా వస్తుంది.
*AC తో రూమ్ చల్లబడ్డాక AC ఆఫ్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిసేపు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. దీనివల్ల కూడా కరెంట్ బిల్ ఆదా అవుతుంది.
*AC ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గితే బిల్ ఆరు శాతం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువసేపు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉండేలా చూసుకోవాలి. దీనివలన కూడా AC బిల్ తగ్గుతుంది.
*కిటికీలకు, తలుపులకు ఏమైనా హోల్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. లేకపోతే AC ఆన్ చేసినా రూమ్ తొందరగా చల్లబడదు. దీని వలన AC బిల్ పెరుగుతుంది. కాబట్టి ముందుగా చెక్ చేసుకోవాలి.
*ప్రోగ్రామబుల్ థెర్మోస్టాట్ ని సెట్ చేసుకుంటే మన రూమ్ కి తగ్గట్టుగా టెంపరేచర్ సెట్ చేస్తుంది. దీని వలన AC బిల్ తగ్గుతుంది.
*AC ఫిల్టర్లలో దుమ్ము ఉన్నా మన రూమ్ తొందరగా చల్లబడదు. కాబట్టి ఎప్పటికప్పుడు AC ఫిల్టర్లు క్లీన్ చేసుకోవాలి. దీని వలన రూమ్ తొందరగా చల్లబడి AC బిల్ తగ్గుతుంది.
*AC ఉన్న రూమ్ తలుపులు ఎక్కువ సార్లు తెరవడం మూయడం చేసిన రూమ్ చల్లబడడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీని వలన AC బిల్ ఎక్కువగా వస్తుంది.
*AC ని ఆన్ లో ఉంచి తక్కువ స్పీడ్ లో ఉంచి సీలింగ్ ఫ్యాన్ వేసుకుంటే రూమ్ తొందరగా చల్లబడుతుంది. AC పై లోడ్ తగ్గి బిల్ తగ్గుతుంది.
*AC లు ఉన్నగదిలో టీవీ, ల్యాప్ ట్యాప్ లు వాడకపోవడమే మంచిది. అవి వర్కింగ్ లో ఉంటే రూమ్ లో వేడిని పెంచుతుంది. కాబట్టి AC బిల్ పెరుగుతుంది.
*అలాగే కొన్ని AC ల కనెక్షన్స్ ఇంకో పార్ట్ అవుట్ డోర్ లో ఉంటాయి. అలా అవుట్ డోర్ లో ఉండేవి నీడలో ఉండేలా చూసుకోవాలి. దానివల్ల కూడా తక్కువ కరెంటు బిల్ వస్తుంది.
*అలాగే AC కొత్తది కొనేటప్పుడు 5 స్టార్ AC నే కొనండి. దీనివల్ల కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. అంతకన్నా తక్కువ స్టార్ AC కొంటే కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది.