Summer Tips : ఎండాకాలంలో ఈ జరత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

ఎండాకాలం రాగానే మనం ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.............

Kaburulu

Kaburulu Desk

March 28, 2023 | 12:25 PM

Summer Tips : ఎండాకాలంలో ఈ జరత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

Summer Tips :  ఎండాకాలం రాగానే మనం ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం రాగానే మామూలుగా ఉండే ఎండ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎల్-నినో ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఎండలు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో మనం మన చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా రాసుకోవాలి. అయితే మనం వాడే సన్ స్క్రీన్ లోషన్ లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 ఉండేలా చూసుకోవాలి. ఆకాశంలో మేఘాలు ఉన్నా మనం మన చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా రాసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలంలో మేఘాలు సూర్యుడికి అడ్డుగా ఉన్నా వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా రాసుకోవాలి.

ఎండాకాలంలో మనం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట తిరగకూడదు. కానీ మనకు ఏదయినా పని ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు మనం మనతో పాటుగా గొడుగు తీసుకువెళ్లాలి. లేదా మనం స్కార్ఫ్ కట్టుకోవడం, టోపీ పెట్టుకోవడం లాంటివి చేయాలి. ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళాలి. ఎండాకాలంలో మనం కాటన్ బట్టలు వేసుకోవాలి. ఎండాకాలంలో ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా తాగడం వలన మన చర్మం తేమగా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగలేకపోతే జ్యూస్ లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి కూడా తాగవచ్చు.

AC : ఎండాకాలంలో AC బిల్ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

అతినీలలోహిత కిరణాల నుండి మన కళ్ళను కాపాడుకోవడానికి మనం కళ్ళజోడు పెట్టుకోవాలి. యాంటి బయోటిక్స్ వాడేవారికి ఎండాకాలంలో ఎండ ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి డాక్టర్ ని అడిగి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకోవాలి. ఎండాకాలంలో మనం పెదాలకి లిప్ బామ్ కూడా రాసుకోవాలి. దీని వలన పెదాలు ఎండిపోకుండా ఉంటాయి. ఎండాకాలంలో మనల్ని ఎండ నుంచి కాపాడుకోవడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.