Green Chilli : పచ్చిమిర్చిని పాడవకుండా ఎక్కువకాలం నిలువ ఉంచాలంటే ఏం చేయాలో తెలుసా?

మనం వాడుకునే కూరగాయలు మనం తెచ్చిన కొన్ని రోజులకే వాడిపోతుంటాయి, పాడైపోతుంటాయి. కానీ మనం అన్ని కూరలలో పచ్చిమిర్చి వాడుకుంటాము కాబట్టి ఎక్కువగా పచ్చిమిర్చి కొంటూ ఉంటాము. అయితే అవి కూడా.......................

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 04:40 PM

Green Chilli : పచ్చిమిర్చిని పాడవకుండా ఎక్కువకాలం నిలువ ఉంచాలంటే ఏం చేయాలో తెలుసా?

Green Chilli :  మనం వాడుకునే కూరగాయలు మనం తెచ్చిన కొన్ని రోజులకే వాడిపోతుంటాయి, పాడైపోతుంటాయి. కానీ మనం అన్ని కూరలలో పచ్చిమిర్చి వాడుకుంటాము కాబట్టి ఎక్కువగా పచ్చిమిర్చి కొంటూ ఉంటాము. అయితే అవి కూడా తొందరగా పాడవుతుంటాయి. మనం పచ్చిమిర్చిని ఫ్రిజ్ లో పెట్టుకున్నా కూడా తొందరగా పాడవుతుంటాయి. కాబట్టి పచ్చిమిర్చిని తొందరగా పాడవకుండా ఉండడానికి మనం కొన్ని చిట్కాలను పాటించవచ్చు.

పచ్చిమిర్చి తొడిమలను ముందుగానే తీసి ఉంచుకోవాలి. ఆ తరువాత మన దగ్గర ఉన్న పచ్చిమిర్చిలో పాడైనవి ఉంటే తీసెయ్యాలి. మిగిలిన పచ్చిమిర్చిని జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టి మూత పెట్టాలి. ఆ జిప్ లాక్ బ్యాగ్ ను ఫ్రిజ్ లో ఉంచితే చాలా రోజులు పచ్చిమిర్చి పాడవకుండా నిలువ ఉంటాయి.

చెంచా వెనిగర్ ను నీళ్ళల్లో వేసి ఆ తరువాత పచ్చిమిర్చి ఆ నీళ్ళల్లో కాసేపు ఉంచాలి. ఆ తరువాత పచ్చిమిర్చి తొడిమలు తీసేసి గాలికి ఆరబెట్టాలి. ఆ తరువాత పచ్చిమిర్చిని జిప్ లాక్ బ్యాగ్ లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే చాలా రోజులు పచ్చిమిర్చి పాడవకుండా ఉంటాయి.

పచ్చిమిర్చిని శుభ్రంగా నీటితో కడిగి, పాడైనవి ఉంటే తీసేసి, పచ్చిమిర్చికి తొడిమెలు తీసి ఒక గాలి వెళ్ళని డబ్బాలో పేపర్ వేసి ఆరిన పచ్చిమిర్చిని అందులో వేసి పైన ఇంకో పేపర్ టవల్ లేయర్ వేసి డబ్బా మూత పెట్టాలి. ఆ తరువాత దానిని ఫ్రిజ్ లో ఉంచితే పచ్చిమిర్చి ఎక్కువకాలం పాడవకుండా నిలువ ఉంటాయి.

Lips Cracking : ఎండాకాలంలో పెదాలు పొడిబారుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

పచ్చిమిర్చిని పేస్ట్ లా తయారు చేసుకొని కూడా ఎక్కువ కాలం నిలువ ఉంచుకోవచ్చు. దానికి పచ్చిమిర్చిని శుభ్రంగా నీటితో కడుగుకొని తడి ఆరిపోయేవరకు ఆరబెట్టాలి. ఇలా చేసిన పచ్చిమిర్చిని తడి లేకుండా చూసుకొని నీళ్లు పోయకుండా కొద్దిగా ఉప్పు వేసి మిక్సి పట్టాలి. అలా తయారు చేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ కాలం పాడవకుండా నిలువ ఉంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చిని పాడవకుండా నిలువ చేసుకోవచ్చు.