Ceiling Fans : ఎక్కువ రెక్కలు ఉన్న ఫ్యాన్ వాడితే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుందా??
ఎండాకాలం రాగానే ఎవరి ఇంట్లో అయినా నాన్ స్టాప్ గా ఫ్యాన్ అనేది తిరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఏ ఫ్యాన్ వాడడం వలన మనకు ఎక్కువ గాలి వస్తుంది అనేది..............

Ceiling Fans : ఎండాకాలం రాగానే ఎవరి ఇంట్లో అయినా నాన్ స్టాప్ గా ఫ్యాన్ అనేది తిరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఏ ఫ్యాన్ వాడడం వలన మనకు ఎక్కువ గాలి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫ్యాన్లలో చాలా రకాల రెక్కలు ఉన్న ఫ్యాన్స్ ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు రెక్కల ఫ్యాన్లు ఉన్నాయి. అయితే మనం మన ఇళ్లల్లో ఎక్కువగా మూడు రెక్కల ఫ్యాన్లను వాడుకుంటాము.
ఏ ఫ్యాన్ అయినా వాటి బ్లేడ్లు, మోటార్ ను బట్టి గాలి అనేది వస్తుంది, అదేవిధంగా కరెంట్ బిల్ కూడా వస్తుంది. రెండు రెక్కల ఫ్యాన్లు చిన్న గదికి ఉపయోగిస్తే గది తొందరగా చల్లబడుతుంది. మూడు రెక్కల ఫ్యాన్లు వాడుకోవడం వలన అది మన ఇంటిలో అన్ని వైపులా గాలి వచ్చేలా చేస్తుంది. దీని వలన కరెంట్ బిల్ కూడా తక్కువగానే ఉంటుంది. నాలుగు రెక్కల ఫ్యాన్లు కూడా ఇప్పుడు వాడుతున్నారు. ఇవి గదిలో గాలిని తొందరగా వ్యాపించేలా చేస్తాయి. పెద్ద పెద్ద గదులు ఉన్నవారు వీటిని వాడడం వలన గాలి తొందరగా రూమ్ అంతా వ్యాపిస్తుంది.
Summer Tips : ఎండాకాలంలో ఈ జరత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..
కాబట్టి మనం ఏ ఫ్యాన్ వాడిన దానిలో ఉండే రెక్కల సంఖ్యను బట్టి కరెంట్ వాడకం పెరుగుతుంది అని అనుకుంటారు. కానీ దానికి వాడిన మోటార్ ను బట్టి కరెంట్ వాడకం పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. చిన్న మోటార్ ఉంది RPM తక్కువగా ఉంటే కరెంట్ వాడకం తగ్గుతుంది. ఫ్యాన్ రెక్కలు అనేవి కొద్దిగా వంపు తిరిగి ఉంటాయి. ఇలా ఉంటేనే గాలి గది మొత్తం వ్యాపిస్తుంది.