Lips Cracking : ఎండాకాలంలో పెదాలు పొడిబారుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..
ఎండాకాలంలో కొంతమందికి పెదాలు పొడిబారిపోయి నిర్జీవంగా అవుతుంటాయి. ఎండాకాలంలో మనం నీళ్లు ఎన్ని తాగినా ఇంకా దాహం వేస్తుంది. గొంతు తడి ఆరిపోతుంటుంది, అదేవిధంగా పెదాలు పొడిబారడం కూడా.................

Lips Cracking : ఎండాకాలంలో కొంతమందికి పెదాలు పొడిబారిపోయి నిర్జీవంగా అవుతుంటాయి. ఎండాకాలంలో మనం నీళ్లు ఎన్ని తాగినా ఇంకా దాహం వేస్తుంది. గొంతు తడి ఆరిపోతుంటుంది, అదేవిధంగా పెదాలు పొడిబారడం కూడా జరుగుతుంటాయి. ఎండాకాలంలో పెదాలు పొడిబారకుండా ఉండడానికి మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
Leafy Vegetables : వండేముందు ఆకుకూరలను శుభ్రం చేస్తున్నారా.. లేకపోతే..
*మనం రోజూ వాడుకునే లిప్ బామ్ నాసిరకంది కాకుండా మంచి క్వాలిటీది అయి ఉండేలా చూసుకోవాలి.
*ఎండాకాలంలో మంచి నీరు ఎక్కువగా తాగుతుండాలి. లేకపోతే మన శరీరం డీ హైడ్రాషన్ అయ్యి పెదాలు పొడిబారడం, వడదెబ్బ తగలడం వంటివి జరుగుతాయి.
*ఎండాకాలంలో తేమ లేకపోవడం వలన కూడా పెదాలు పొడిబారడం జరుగుతాయి. కాబట్టి మన ఇంటిలో హ్యుమిడిఫేయ్యర్ ఉంచుకుంటే మన శరీరం డీ హైడ్రాషన్ అవ్వకుండా ఉండి పెదాలు పొడిబారకుండా ఉంటాయి.
*జొజోబా ఆయిల్, షీ బట్టర్ వంటివి కూడా లిప్ బామ్ గా వాడుకుంటే పెదాలు పొడిబారకుండా ఉంటాయి.
*మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి లోపించినా పెదాలు పొడిబారుతుంటాయి. కాబట్టి మనం తినే వాటిలో ఎగ్, లివర్, ఆకుకూరలు, చేపలు, పాలు, చీజ్ ఉండేలా చూసుకోవాలి. వీటిలో విటమిన్ బి ఉంటుంది కాబట్టి పెదాలు పొడిబారకుండా ఉంటాయి.
*ఒక గ్లాసుడు నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి మరిగించాలి. తరువాత చల్లార్చి ఆ నీటిని తాగడం వలన పెదాలు పొడిబారకుండా ఉంటాయి.
*అలోవెరా గుజ్జు, కొబ్బరి నూనె, తేనెను పెదాలకు రాయడం ద్వారా కూడా పెదాలు పొడిబారకుండా ఉంటాయి.
*స్వచ్ఛమైన నెయ్యిని రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే పెదాలు పొడిబారడం తగ్గుతుంది.
*తాజా వెన్నను రాత్రి పడుకునే ముందు పెదాలకు రాసుకున్నా పెదాలు పొడిబారడం తగ్గుతుంది.