Sugar Cane Juice : ఈ సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు..
ఎండాకాలం రాగానే అందరూ చల్లదనానికి చెరుకురసం తాగుతుంటారు. అది ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది అని మనం మన పిల్లలకు కూడా చెరుకురసం తాగిస్తుంటాము. కానీ అందరూ చెరుకురసం తాగడం మంచిది కాదు. మనకు ఉన్న................

Sugar Cane Juice : ఎండాకాలం రాగానే అందరూ చల్లదనానికి చెరుకురసం తాగుతుంటారు. అది ఎంతో రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది అని మనం మన పిల్లలకు కూడా చెరుకురసం తాగిస్తుంటాము. కానీ అందరూ చెరుకురసం తాగడం మంచిది కాదు. మనకు ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి చెరుకురసం తాగాలా వద్దా అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ తో భాధపడేవారు చెరుకురసం తాగకూడదు. ఎందుకంటే చెరుకురసం బయట రోడ్ల మీద తయారుచేస్తుంటారు. అలాంటి సమయంలో ఈగలు, దుమ్ము వంటివి చెరుకురసంలో పడుతుంటాయి. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఉన్నవారు చెరుకురసం తాగకూడదు.
అలాగే చెరుకురసం జలుబు, దగ్గుగా ఉన్నప్పుడు తాగకూడదు. ఎందుకంటే చెరుకురసం చల్లగా ఉంటుంది. దీని వలన జలుబు, దగ్గు ఇంకా పెరుగుతాయి. తలనొప్పి సమస్య తరచూ వస్తూ ఉంటే వారు కూడా చెరుకురసం తాగకూడదు. చెరుకురసం తాగితే తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అధిక బరువుతో ఉన్న వారు చెరుకురసం తాగకూడదు. చెరుకురసం తాగితే క్యాలరీలు శరీరంలో ఎక్కువగా పెరుగుతాయి.
Home cooling tips : ఎండాకాలంలో AC లేకపోయినా మన గదిని చల్లగా ఉంచుకోవచ్చు తెలుసా?
అధిక రక్తపోటు ఉన్నవారు కూడా చెరుకురసం తాగడం మంచిది కాదు. క్యావిటీస్ ఉన్నవారు కూడా చెరుకురసం తాగకూడదు. ఎందుకంటే చెరుకురసంలో ఉండే చక్కర దంతాలు ఇంకా దెబ్బతినేలా చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా చెరుకురసం తాగకూడదు. బరువు తగ్గాలని జిమ్ కి వెళ్లేవారు కూడా చెరుకురసం తాగకూడదు. ఎందుకంటే చెరుకురసం వలన మన శరీరంలోనికి ఎక్కువ క్యాలరీలు చేరి మనం బరువు తగ్గడానికి చేసిన వ్యాయామాలు అన్నీ వృధా అవుతాయి. కాబట్టి మనం చెరుకురసం తాగాలా వద్దా అన్న విషయం మన ఆరోగ్యంపైన ఆధారపడి ఉంటుంది. దంత సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు చెరుకురసం తాగకూడదు.