Summer Tips : వేసవి కాలంలో ఈ టిప్స్ తో చర్మాన్ని కాపాడుకోండి..

 ఎండాకాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన చర్మాన్ని కాపాడుకోవాలి.........................

Kaburulu

Kaburulu Desk

March 31, 2023 | 08:19 PM

Summer Tips : వేసవి కాలంలో ఈ టిప్స్ తో చర్మాన్ని కాపాడుకోండి..

Summer Tips :  ఎండాకాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన చర్మాన్ని కాపాడుకోవాలి. వేసవి కాలం రాగానే మనకు చెమటలు బాగా వస్తాయి. చర్మం పైన జిడ్డు పేరుకుపోతుంటుంది. దీని వలన మన ముఖంపైన మొటిమలు వస్తాయి. కాబట్టి ఎండాకాలంలో మన ముఖాన్ని రోజుకు మూడు సార్లు కడుగుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మన ముఖం పైన మృతకణాలు తొలగి చర్మం ఫ్రెష్ గా, కాంతివంతంగా కనిపిస్తుంది.

ఎండాకాలంలో ఎండకు మన ముఖం డల్ గా, నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి మనం రోజూ స్నానం చేసేముందు ఎసెన్షియల్ నూనెతో చర్మానికి మసాజ్ చేసి మన చర్మానికి సరిపడా న్యాచురల్ స్క్రబ్ తో వాల్ష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు అయినా చేస్తే మన చర్మం ఫ్రెష్ గా ఉంటుంది. ఎండాకాలంలో కూడా మన చర్మానికి మాయిశ్చరైజర్ వాడాలి. మన చర్మానికి ఏది సరిపోతుందో చూసుకొని లేదా డెర్మటాలజిస్ట్ ను కలిసి మనకు సరిపడ మాయిశ్చరైజర్ ను వాడుకోవాలి. మనం ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అప్పుడే మన చర్మం యూవీ కిరణాల నుండి రక్షణ పొందుతుంది. ఇంకా మన చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

Lips Cracking : ఎండాకాలంలో పెదాలు పొడిబారుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

ఎండాకాలంలో అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి మనకు చెమటలు ఎక్కువగా ఉండి మన శరీరంలోని నీరు అంత బయటకు పోతుంటుంది. దానివల్ల డీ హైడ్రాషన్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఎండాకాలంలో నీరు, జ్యూస్, సూప్ వంటివి ఎక్కువగా తాగుతుండాలి. మన చర్మం తాజాగా ఉంచుకోవడానికి మనం తినే ఆహారంలో ఈ కాలంలో దొరికే పండ్లను( మామిడి, బెర్రీస్, పుచ్చకాయ), తాజా కూరగాయలను తినాలి. అప్పడే మన చర్మం తాజాగా ఉంటుంది. మనం ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూల్ గ్లాసెస్, గొడుగు తీసుకెళ్లాలి. ఇంకా మనం స్కార్ఫ్ కట్టుకొని బయటకు వెళితే ఇంకా మంచిది. ఇలా చేయడం వలన మనం ఎండ నుండి మన చర్మాన్ని కాపాడుకోవచ్చు.