Planets on Parade: రేపు రాత్రి ఆకాశంలో అద్భుతం.. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు కనువిందు!

Kaburulu

Kaburulu Desk

March 27, 2023 | 11:40 PM

Planets on Parade: రేపు రాత్రి ఆకాశంలో అద్భుతం.. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు కనువిందు!

Planets on Parade: ఆకాశంలో మరో అరుదైన అద్భుతం కనిపించనుంది. సూర్యాస్తమయం తర్వాత ఒకే చోట ఐదు గ్రహాలు కనిపించనున్నాయి. అది కూడా భూమి మీద నుంచి నేరుగా వీక్షించవచ్చు. ఈ నెల 28వ తేదీన అంటే మంగళవారం రాత్రి ఐదు గ్రహాలు ఒకేసారి నీలాకాశంలో వారసకట్టి కనిపించనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, మార్స్, యురేనస్ గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చి హారిజోన్ పైన ఆర్క్ ఆకారంలో దర్శనమిస్తాయి.

ఈ అద్భుతాన్ని చూడటం మిస్ అవకండి. వీలైతే.. మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్ ను కూడా రెడీగా ఉంచుకోండి. దానిని చూడాలంటే.. పశ్చిమం వైపుకి చూడాల్సి ఉంటుంది. ‘50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు’ అని నాసాకు చెందిన బిల్ కూక్ సూచించారు.

2022 జూన్ లో కూడా ఇలాంటి అద్భుతం ఆకాశంలో కనిపించింది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఒకే లేఖనంపైకి వచ్చారు. కాగా.. రేపు జరగబోయే ఈ దృశ్యాన్ని ఖచ్చితంగా చూడాలని అమెరికా మాజీ ఖళోగ శాస్త్రవేత్త, చంద్రుడిపై నడిచిన తొలి వ్యొమగామి అయిన డాక్టర్ బజ్ ఆల్డ్రిన్ కూడా సూచించారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని తెలిపారు. అయితే, కొన్ని దేశాల్లోని ప్రజలకు మాత్రమే వీటిని చూసే అవకాశం దక్కుతుందని ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మెస్సియర్ అన్నారు.

సిటీల్లో నివసించే వాళ్లకి ఇవి కనిపించకపోవచ్చని.. సిటీలకు దూరంగా అడవి ప్రాంతాల్లో బైనాకులర్ లేదా టెలిస్కోప్ సాయంతో వీటిని చూడొచ్చని చార్లెస్ మెస్సియర్ తెలిపారు. ఆకాశంలో బృహస్పతి, మెర్క్యురీ పక్కపక్కనే కనిపిస్తాయి. శుక్రుడు పెద్దగా కనిపిస్తాడు. అయితే, సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గంట సమయం వరకే ఇవి కనిపించనున్నాయి.