Tulasi Leaves : తులసి ఆకులను తినొచ్చు కూడా.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

తులసి ఆకులను తినడం వలన మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకులలో ఉండే ఔషధగుణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తులసి ఆకులను............

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 06:11 PM

Tulasi Leaves : తులసి ఆకులను తినొచ్చు కూడా.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Tulasi Leaves :  తులసి ఆకులను తినడం వలన మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకులలో ఉండే ఔషధగుణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తులసి ఆకులను చలి కాలంలో తినడం వలన మనకు వచ్చే జలుబు, దగ్గు వంటివి తగ్గుతాయి. ఇంకా చలికాలంలో వచ్చే సీజోనల్ వేరియేషన్స్ నుండి మనల్ని కాపాడుకోవచ్చు.

షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి తులసి ఆకులను రాత్రంతా నానబెట్టి వాటిని ఉదయం తినాలి. ఇలా రోజూ చేయడం వలన మన శరీరంలో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తులసి ఆకులను నానబెట్టిన వాటిని రోజూ ఖాళీ కడుపుతో తినాలి. తులసి ఆకులలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు మన శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. తులసి ఆకుల కషాయాన్ని తాగడం వలన కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటివి తొందరగా రాకుండా చేస్తుంది.

తులసి ఆకుల రసం తాగడం వలన మనకు పొట్టకు సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేద మందులలో కూడా తులసి ఆకుల రసాన్ని వాడతారు. మలేరియా లేదా జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకుల రసాన్ని తాగడం వలన తొందరగా తగ్గుతుంది. తులసి ఆకుల రసం తాగడం వలన మన శరీరంలో చెడు కొవ్వు చేరకుండా చేస్తుంది. చిన్న పిల్లలకు కూడా తులసి ఆకుల రసం తాగించడం వలన తొందరగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి రాకుండా ఉంటాయి. వచ్చినా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంది.

Fruit Peel : పండ్ల తొక్కలతో కూడా ఫేస్ ప్యాక్ లు చేసుకొని అందాన్ని పెంచుకోవచ్చు తెలుసా??

తులసి ఆకులను, కొద్దిగా పసుపు పొడిని నీళ్ళల్లో వేసి మరిగించి దానిని తాగడం వలన కూడా మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చిన్న పిల్లలకు తులసి ఆకుల రసం ఘాటుగా ఉంది అనుకుంటే తులసి ఆకులను డైరెక్ట్ గా నమలవచ్చు ఇలా చేసిన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మనకి గుళ్ళల్లో తులసి తీర్థం ఇస్తారు. అది సాంప్రదాయం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని ఇస్తారు. ఇక తులసి చెట్లని మన ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి, ఇంటికి ఎంత మంచిదో అందరికి తెలిసిందే.