Fruit Peel : పండ్ల తొక్కలతో కూడా ఫేస్ ప్యాక్ లు చేసుకొని అందాన్ని పెంచుకోవచ్చు తెలుసా??
పండ్లు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని అందరికీ తెలుసు. అలాగే పండ్ల తొక్కలతో ఫేస్ ప్యాక్ లు చేసుకోవడం వలన మన చర్మం ఎంతో యవ్వనంగా మరియు మెరుస్తూ కనబడుతుంది. ఇంకా మన చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గడానికి కూడా...................

Fruit Peel : పండ్లు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అని అందరికీ తెలుసు. అలాగే పండ్ల తొక్కలతో ఫేస్ ప్యాక్ లు చేసుకోవడం వలన మన చర్మం ఎంతో యవ్వనంగా మరియు మెరుస్తూ కనబడుతుంది. ఇంకా మన చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గడానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ లు ఉపయోగపడతాయి.
ఒక గిన్నెలో నారింజ తొక్కల పొడిని తీసుకొని దానికి కొద్దిగా పసుపు కలపాలి. దానికి కొద్దిగా తేనెను, రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ లాగా తయారుచేయాలి. దీనిని ముఖానికి ఒక పదిహేను నిముషాల పాటు ఉంచి ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన మన ముఖంపై మొటిమలు తగ్గుతాయి.
ఒక గిన్నెలో బ్రౌన్ షుగర్ పొడి, బాదం నూనె, తేనె, నిమ్మకాయ తొక్కల పొడిని కలిపి పేస్ట్ లాగా చేసుకొని దానిని ఫేస్ కి ప్యాక్ లాగా పదిహేను నిముషాలు ఉంచుకొని తరువాత చల్లని నీటితో కడగాలి ఇలా చేయడం వలన మన చర్మంపై ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది.
అరటిపండు తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో కొన్ని అరటిపండ్ల ముక్కలను కూడా కలిపి మిక్సి పట్టి దానిలో కొద్దిగా పాలను కూడా కలిపి మిక్సి పట్టాలి. ఇలా చేసిన దానిని ఫ్రిజ్ లో పెట్టి తరువాత ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా పట్టించాలి. పదిహేను నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి. దీని వలన చర్మం కాంతివంతంగా కనబడుతుంది.
ఆపిల్ తొక్కలకు, పెరుగును కలిపి మిక్సి పట్టాలి దానిని ఫేస్ ప్యాక్ లాగా రాసుకోవాలి. దీని వలన చర్మం పై మొటిమలు, నల్లటి వలయాలు తగ్గుతాయి.
Healthy Food for Heart : గుండెకు మంచి చేసే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.. ఇవి కచ్చితంగా తినండి..
దానిమ్మ తొక్క పొడిని, నిమ్మ రసం కలిపి దానికి కొద్దిగా తేనెను కలపాలి. ఫేస్ ప్యాక్ ముఖానికి రాసుకున్న తరువాత పదిహేను నిముషాలకు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా చేయడం వలన చర్మంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనబడతారు. ఈ విధంగా మనం మన చర్మాన్ని పండ్ల తొక్కలతో కూడా మెరిసేలా, యవ్వనంగా కనబడేలా తయారు చేసుకోవచ్చు.